Narayana Murthy: ఉచిత పథకాలతో పేదరికం పోదు.. నారాయణ మూర్తి

ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలను సృష్టించి, ఉద్యోగాలు కల్పిస్తే పేదరికం ఇట్టే మాయమైపోగలదని ఆయన చెప్పారు. టైకాన్ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు.
"పేదరిక సమస్యను ఉద్యోగాల ద్వారా పరిష్కరించవచ్చు" అని ఆయన అన్నారు. ఉద్యోగాల కల్పన ద్వారా పేదరికం గణనీయంగా తగ్గిపోతుందంటూ, ప్రతి ఎంట్రప్రెన్యూర్ల నుంచి వందల నుంచి వేల కొద్దీ ఉద్యోగాలు కల్పించగల సామర్థ్యమున్నట్లు నమ్మకమూ వ్యక్తం చేశారు.
Amazon jobs: 10వ తరగతి అర్హతతో అమెజాన్ వేర్‌హౌస్‌లో ఉద్యోగాలు
"ప్రపంచంలో ఎలాంటి దేశం కూడా ఉచిత పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించలేద" అని మూర్తి తెలిపారు, ఉచిత పథకాలకంటే వాటి వల్ల ప్రత్యక్ష ప్రయోజనాలు రావడం అవసరమని చెప్పారు. ఉదాహరణగా, కొన్ని ఉచిత పథకాల ప్రయోజనాలను చర్చిస్తూ, "ఉచిత కరెంటు ఇచ్చినప్పటికీ, ఆ పథకం దీర్ఘకాలంలో ఎలా ఉపయోగపడిందో, పిల్లల విద్య, తల్లిదండ్రుల ఆసక్తి పెరిగిందో అనే అంశాలు కూడా అనుకుంటే, పథకాలు మెరుగుపడతాయి" అన్నారు.
పాలిటిక్స్ లేదా గవర్నెన్స్‌లో తనకు పెద్దగా తెలియదని, తన అభిప్రాయాలు కేవలం విధానాలపరంగా, సరైన చర్యలను సూచించడమే అని ఆయన స్పష్టం చేశారు.
BOI Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!