Indian Polity Bit Bank: భారత రాజ్యాంగం ప్రకారం 'స్త్రీలను గౌరవించడం' అనేది?
1. భారత రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది?
1) స్టీరింగ్ కమిటీ
2) రూల్స్ కమిటీ
3) ఫైనాన్స్ కమిటీ
4) హúజ్ కమిటీ
- View Answer
- Answer: 4
2. భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు?
1) హిందీ
2) స్పానిష్
3) అరబిక్
4) ఫ్రెంచ్
- View Answer
- Answer: 3
3. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న న్యాయ భావనకు ఆధారమైంది ఏది?
1) ఫ్రాన్స్
2) సోవియట్ రష్యా
3) అమెరికా
4) జపాన్
- View Answer
- Answer: 2
4. స్వాతంత్య్రానికి ముందే 1937లో భాషా ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాలు ఏవి?
1) బెంగాల్, పంజాబ్
2) ఒడిశా, బెంగాల్
3) పంజాబ్, సింధ్
4) ఒడిశా, సింధ్
- View Answer
- Answer: 4
5. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడైన తొలి భారతీయుడు ఎవరు?
1) సచ్చితానంద సిన్హా
2) సత్యేంద్రప్రసాద్ సిన్హా
3) విఠల్ భాయ్ పటేల్
4) సత్యేంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- Answer: 2
6. కింది వాటిలో సరికాని జత?
1) కమ్యూనల్ అవార్డ్ - 1932
2) సిమ్లా సమావేశం - 1945
3) క్రిప్స్ రాయబారం - 1941
4) కేబినేట్ మిషన్ ప్లాన్ - 1946
- View Answer
- Answer: 3
7. మారా, లూయి, చక్మా అనే గిరిజన జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మేఘాలయ
2) మిజోరాం
3) త్రిపుర
4) మణిపూర్
- View Answer
- Answer: 2
8. కింది వాటిలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు?
1) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, మరాఠి
2) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠి, ఒడియా
3) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, గుజరాతీ
4) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, ఒడియా
- View Answer
- Answer: 4
9. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ భావన భారత దేశాన్ని సంపూర్ణ స్వాతంత్ర దేశమని తెలుపుతోంది?
1) సర్వసత్తాక
2) సామ్యవాద
3) ప్రజాస్వామ్య
4) గణతంత్ర
- View Answer
- Answer: 1
10. ఇందిరా సహానీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో (1992) ఏ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
1) ఎస్సీ
2) ఎస్టీ
3) ఓబీసీ
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
11. కింది వాటిలో సరికానిది ఏది?
1) మొదటి జాతీయ వేతన సంఘం చైర్మన్ - వరదాచారి అయ్యర్
2) రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ - ఫజల్ అలీ
3) రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ చైర్మన్ - వీరప్ప మెయిలీ
4) నాలుగో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్ - ఎల్.ఎం. సింఘ్వి
- View Answer
- Answer: 4
12. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సిఫార్సు చేసిన కమిటీ?
1) కె. సంతానం కమిటీ
2) ఎల్.ఎం. సింఘ్వి కమిటీ
3) స్వరణ్ సింగ్ కమిటీ
4) మొరార్జీ దేశాయ్ కమిటీ
- View Answer
- Answer: 1
13. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు?
1) రెండో షెడ్యూల్లో పార్ట్ - ఎ
2) రెండో షెడ్యూల్లో పార్ట్ - బి
3) రెండో షెడ్యూల్లో పార్ట్ - సి
4) రెండో షెడ్యూల్లో పార్ట్ - డి
- View Answer
- Answer: 4
14. 'వ్యక్తిగత గోప్యత' ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం అని తీర్పు చెప్పిన 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించింది ఎవరు?
1) దీపక్ మిశ్రా
2) జె.ఎస్. ఖేహర్
3) హెచ్.ఎల్. దత్తు
4) జాస్తి చలమేశ్వర్
- View Answer
- Answer: 2
15. తొమ్మిదో షెడ్యూల్లో పొందుపర్చిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని తెలిపే అధికరణ ఏది?
1) 31-ఎ
2) 31-బి
3) 31-సి
4) పైవేవీ కాదు
- View Answer
- Answer: 2
16. 'మేము ఆదేశిస్తున్నాం' అనే అర్థం వచ్చే రిట్?
1) కో-వారెంటో
2) హెబియస్ కార్పస్
3) మాండమస్
4) సెర్షియోరరీ
- View Answer
- Answer: 3
17. బిహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన వ్యక్తి?
1) కామేశ్వరి సింగ్
2) హుకుం సింగ్
3) దర్భంగా మహారాజు
4) భగవాన్ సింగ్
- View Answer
- Answer: 1
18. బాలబడి విద్య గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది?
1) 15(1)
2) 21(ఎ)
3) 41
4) 45
- View Answer
- Answer: 4
19. భారత రాజ్యాంగం ప్రకారం 'స్త్రీలను గౌరవించడం' అనేది?
1) ప్రాథమిక హక్కు
2) ఆదేశిక సూత్రం
3) ప్రాథమిక విధి
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
20. కేంద్ర - రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి?
1) 9
2) 10
3) 11
4) 12
- View Answer
- Answer: 4
21. కింది భారత ప్రధాన మంత్రులను వారు నిర్వహించిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో గుర్తించండి.
1) ఐ.కె. గుజ్రాల్ - దేవెగౌడ - వాజ్పేయి - వి.పి. సింగ్
2) చంద్రశేఖర్ - పి.వి. నరసింహారావు - ఐ.కె. గుజ్రాల్ - దేవె గౌడ
3) చంద్రశేఖర్ - పి.వి. నరసింహారావు - దేవెగౌడ - ఐ.కె. గుజ్రాల్
4) పి.వి. నరసింహారావు - ఐ.కె. గుజ్రాల్ - దేవె గౌడ - వాజ్పేయి
- View Answer
- Answer: 3
22. కింది వాటిలో సమాఖ్య వ్యవస్థ అమలులో లేని దేశం?
1) ఫ్రాన్స్
2) స్విట్జర్లాండ్
3) కెనడా
4) అర్జెంటీనా
- View Answer
- Answer: 1
23. జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఆర్టికల్ -249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభకు మాత్రమే తీర్మానం చేసే అధికారాన్ని కల్పించారు. దీనికి కారణం?
1) రాజ్యసభ ఎగువ సభ కాబట్టి
2) రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి
3) రాజ్యసభ పెద్దల సభ కాబట్టి
4) రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి
- View Answer
- Answer: 4
24. మహాదమి ట్రైబ్యునల్ ఏ రాష్ట్రాలకు సంబంధించింది?
1) కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్
2) మహారాష్ట్ర, గోవా, కర్ణాటక
3) కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ
4) కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గఢ్
- View Answer
- Answer: 2
25. అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం చైర్మన్?
1) ప్రధానమంత్రి
2) హోం మంత్రి
3) విదేశాంగ మంత్రి
4) రక్షణ మంత్రి
- View Answer
- Answer: 2
26. ప్రభుత్వానికి అత్యవసరంగా వ్యయం చెల్లించాలంటే ఏ ఖాతా నుంచి చెల్లిస్తుంది?
1) భారత సంఘటిత నిధి
2) భారత ఆగంతుక నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
27. కింది వారిలో భారత రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉండేవారు ఎవరు?
1) యూపీఎస్సీ చైర్మన్
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3) అటార్నీ జనరల్
4) ప్రధాన ఎన్నికల కమిషనర్
- View Answer
- Answer: 3
28. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నూతనంగా ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేశారు?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- Answer: 3
29. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరిలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు?
1) 356
2)365
3)239-ఎఎ
4)239-ఎబి
- View Answer
- Answer: 4
30. ఒక వ్యక్తికి క్రిమినల్ కేసులో 5 ఏళ్లు శిక్ష పడితే ఎన్నేళ్లు ఎంపీగా పోటీ చేసేందుకు అనర్హులు?
1) 5
2) 10
3) 11
4) 15
- View Answer
- Answer: 3
31. వివిధ రాష్ట్రాల్లో విధాన సభ సభ్యుల సంఖ్యను అనుసరించి ఎక్కువ నుంచి తక్కువకు వరుసగా ఉన్న దాన్ని గుర్తించండి.
1) తెలంగాణ, పంజాబ్, అసోం, కేరళ
2) కేరళ, అసోం, తెలంగాణ, పంజాబ్
3) కేరళ, తెలంగాణ, అసోం, పంజాబ్
4) అసోం, తెలంగాణ, పంజాబ్, కేరళ
- View Answer
- Answer: 2
32. కింది వాటిలో సరికాని జత ఏది?
1) బాండుంగ్ ఒప్పందం - 1950
2) పంచశీల ఒప్పందం - 1954
3) తాష్కేంట్ ఒప్పందం - 1966
4) సిమ్లా ఒప్పందం -1972
- View Answer
- Answer: 1
33. సుప్రీంకోర్టు ఏ అధికారంలో అంతర్భాగంగా తాను ఇచ్చిన తీర్పులు భవిష్యత్ తీర్పులకు సలహాగా, మార్గదర్శిగా ఉంటాయి?
1) ప్రారంభ విచారణాధికారం
2) కోర్ట్ ఆఫ్ రికార్డ్
3) న్యాయ సలహా అధికారం
4) న్యాయ సమీక్ష
- View Answer
- Answer: 2
34. కింది వాటిలో తెలుగు వారు చేపట్టిన పదవులను గుర్తించండి.
1) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి
2) రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపప్రధాన మంత్రి, లోక్సభ స్పీకర్
4) రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- Answer: 2
35. కింది వాటిలో సరైంది ఏది?
1) సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి
2) నూతన రాష్ట్రాల ఏర్పాటులో రెండు సభలకు సమాన అధికారాలు ఉన్నాయి
3)ద్రవ్య బిల్లును ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ తిరస్కరించవచ్చు
4) రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
- View Answer
- Answer: 2
36. సి.బి.ఐ. ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకం అని ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది?
1) ఢిల్లీ
2) ముంబై
3) చెన్నై
4) గౌహతి
- View Answer
- Answer: 4
37. భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్ ఎప్పుడు వాపస్ వస్తుంది?
1) మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్లు వచ్చినప్పుడు
2) గెలిచిన ఓట్లలో ఆరో వంతు వచ్చినప్పుడు
3) పోలైన ఓట్లలో ఆరో వంతు వచ్చినప్పుడు
4) పోలై చెల్లిన ఓట్లలో ఆరో వంతు వచ్చినప్పుడు
- View Answer
- Answer: 4
38. కింది వాటిలో మంత్రి మండలి విధి కానిది?
1) ప్రభుత్వ విధానాల రూప కల్పన
2) పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహా
3) శాసనాలను రూపొందించడం
4) పైవేవీకాదు
- View Answer
- Answer: 3
39. కేంద్ర మంత్రి మండలి సంఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) పార్లమెంట్ సభ్యుల్లో 15% మించకూడదు
2) పార్లమెంట్ సభ్యుల్లో 10% మించకూడదు
3) లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు
4) లోక్సభ సభ్యులో 10% మించకూడదు
- View Answer
- Answer: 3
40. లోక్సభ స్పీకర్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసినప్పుడు పర్యావసనం?
1) తన పదవినీ వెంటనే కోల్పోతాడు
2) ఆరు నెలల వరకు స్పీకర్గా ఉండవచ్చు
3) స్పీకర్గా కొనసాగుతూ 6 నెలల్లో మళ్లీ లోక్సభకు ఎన్నిక కావాలి
4) లోక్సభ తదుపరి సమావేశం వరకు స్పీకర్గా ఉండవచ్చు
- View Answer
- Answer: 1
41. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ - వి.ఎస్. రమాదేవి
బి) లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ - స్నేహలత శ్రీవాస్తవ
సి) కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళ - మమతా శర్మ
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- Answer: 1
42. కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి?
1) బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ
3) సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ
4) మానవ వనరుల అభివృద్ధి శాఖ
- View Answer
- Answer: 3
43. వివిధ పదవులకు సంబంధించి హోదా (ప్రోటోకాల్) క్రమాన్ని అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి అమర్చండి.
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) గవర్నర్
సి) మాజీ రాష్ట్రపతి
డి) ప్రధానమంత్రి
1) డి, సి, బి, ఎ
2) డి, బి, సి, ఎ
3) ఎ, డి, బి, సి
4) డి, ఎ, బి, సి
- View Answer
- Answer: 2
44. న్యాయవాద వర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళ?
1) మీరాసాహెబ్ ఫాతీమా బీవీ
2) సుజాత వసంత్
3) రుమాపాల్
4) ఇందు మల్హోత్రా
- View Answer
- Answer: 4
45. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం - రాజస్థాన్
2) మండల వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం - కర్ణాటక
3) నూతన పంచాయతీరాజ్ చట్టం (1993) తొలిసారిగా అమల్లోకి వచ్చిన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్
4) స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం - బిహార్
- View Answer
- Answer: 3
46. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- Answer: 3
47. లోక్సభ, అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఏ సంవత్సరం వరకు పొడిగించారు? (95వ రాజ్యాంగ సవరణ ద్వారా)
1) 2020
2) 2025
3) 2026
4) 2030
- View Answer
- Answer: 1
48. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో బీసీ కులాల సంఖ్య?
1) 2399
2) 3763
3) 2499
4) 3743
- View Answer
- Answer: 4
49. కింది వాటిలో రాజ్యంగబద్ధమైన సంస్థ?
1) జాతీయ బీసీ కమిషన్
2) జాతీయ మహిళా కమిషన్
3) జాతీయ మానవ హక్కుల కమిషన్
4) జాతీయ భాషాపర మైనారీటీ కమిషన్
- View Answer
- Answer: 4
50. 2-జీ స్పెక్ట్రం కుంభకోణంపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్?
1) రాం నివాస్ మిర్జా
2) శరద్ పవార్
3) పి.సి. చాకో
4) శంకరానంద్
- View Answer
- Answer: 3
Tags
- Indian Polity Bit Bank
- indian polity bit bank in telugu
- indian polity mock test in telugu
- indian polity practice test
- indian polity practice test in telugu
- indian polity bit bank for competitive exams
- Indian Polity Bit Bank For All Competitive Exams
- TSPSC
- APPSC
- Competitive Exams
- Competitive Exams Bit Banks