Skip to main content

TGPSC Groups Topper Success Story : మాది పేద కుటుంబం.. ఇలా చ‌దివి.. వ‌రుస‌గా 4 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్ సాధించానిలా.. కానీ..!

పేద కుటుంబ‌లో పుట్టమా... ధ‌నిక కుటుంబంలో పుట్ట‌మా అనేది కాదు ముఖ్యం.. లైఫ్‌లో విజ‌యం సాధించామా..? లేదా..? అనేది ముఖ్యం అని నిరూపించాడు ఈ యువ‌కుడు.
TSPSC Groups Ranker G Balakrishna Success Story

పేద కుటుంబంలో పుట్టిన‌ ఎంతో మంది బిడ్డ‌లు త‌మ ప్ర‌తిభ‌ను చాటి ఉన్న‌త శిఖరాల్లో ఉన్నారు. తెలంగాణ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన గ్రూప్స్-1,2,3 ఫ‌లితాల్లో... పీఏ పల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. ఈ నేప‌థ్యంలో గడిగ బాలకృష్ణ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

వ‌రుస‌గా..గ్రూప్‌-1,2,3,4ల‌లో...
టీజీపీఎస్సీ గ్రూపు-1లో 400 మార్కులు సాధించగా.. గ్రూప్-2 లో 371 మార్కులతో 442 ర్యాంకును సాధించాడు. అలాగే గ్రూప్ 3లో కూడా రాష్ట్రస్థాయిలో 285 మార్కులతో 381 ర్యాంకును సాధించారు. 

➤☛ NEET Ranker Real Life Story : నీట్‌లో మంచి ర్యాంక్ కోసం.. ఈ తండ్రి త‌న కూతురి కోసం ఏం చేసాడంటే...?

పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వ‌హిస్తునే..
ప్రస్తుతం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో గ్రూప్-4లో ఎంపిక అవడం జరిగింది. 

TGPSC Hostel Welfare Officer Exams Results : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుద‌ల‌... ఎంత మంది సెల‌క్ట్ అయ్యారంటే ...?

Published date : 18 Mar 2025 11:03AM

Photo Stories