Success Story: ఇలా చదివితే.. ఎలాంటి పోటీ పరీక్షలోనైనా విజయం సులువే.. కానీ..
అదే ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ తొలుత 2006లో టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగిపోకుండా తర్వాత 2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2012లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సొంతంచేసుకున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన మందడి నాగార్జున రెడ్డి. ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదివితే ఎలాంటి పోటీ పరీక్షలోనైనా సులువుగా విజయం సాధించొచ్చని అంటారాయన. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికోసం నాగార్జున రెడ్డి సలహాలు- సూచనలు మీకోసం..
Success Story: నా కష్టం వృథా కాలేదు.. గ్రూప్-2 కొట్టానిలా..
కుటుంబ నేపథ్యం :
మాది నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని బోయగూడెం. అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి వారు పడే కష్టాన్ని దగ్గర నుంచి చూశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని పదో తరగతిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నా.
నా ఎడ్యుకేషన్ :
నేను టెన్త్ వరకు రాజవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివా. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తిచేశా. ఇంటర్, డిగ్రీ హాలియాలో చదివా.
TSPSC Groups Success Tips: ఇలా చదివా.. గ్రూప్–1లో స్టేట్ టాపర్‌గా నిలిచా..
సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు..
2006లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)గా సెలెక్ట్ అయ్యా. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ సాధించా. 2011లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఆరో జోన్‌లో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం నల్గొండ మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్నా. ఒక విధులు నిర్వర్తిస్తూనే.. మరో వైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నియామక విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నాను. అలాగే రాత పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నాను.
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
ఈ పుస్తకాలు చదివితే మంచిది..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, వీలైనన్ని ఎక్కువ సార్లు చదవాలి. ఒక సబ్జెక్టు కోసం వేర్వేరు పుస్తకాలు చదవడం వల్ల సమయం వృథా తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ఒకే పుస్తకాన్ని ఎంచుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. చాప్టర్ల వారీగా ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అకాడమీ పుస్తకాలు లేదా మార్కెట్లో దొరికే ప్రామాణిక మెటీరియల్‌ను చదవడం మంచిది.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
సొంతంగా చదవడమే మేలు.. ఎందుకంటే..?
కోచింగ్ తీసుకుంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. ముందు దీన్నుంచి బయటపడాలి. కోచింగ్ ద్వారా ఏయే అంశాలు, ఎలా చదవాలో తెలుస్తుంది. ప్రస్తుతం పలు పోటీ పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు సొంతంగా, ప్రణాళికాబద్ధంగా చదవడం మంచిది. అలాగే వీలైనన్ని మాక్‌టెస్టులు రాయాలి. వీటిద్వారా తాము ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి, వాటిపై మరింత దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.
Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?
ఇలా వచ్చిన డబ్బుతో..
ఈ తహశీల్దార్. పొద్దున్నే.. కోచింగ్ సెంటర్లో బోధిస్తారు. సాయంత్రం.. ‘నక్షత్ర సక్సెస్ అకాడమీ’లో ఆన్‌లైన్ క్లాసులు చెబుతారు. రాత్రి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పుస్తకాలు రాస్తారు. కోచింగ్, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుతో ‘మౌనిక ఫౌండేషన్’ ద్వారా పేదలకు సాయం చేస్తారు. సామాజిక మార్పే లక్ష్యంగా వైవిధ్యమైన మంత్లీ చాలెంజ్ నిర్వహిస్తున్న ఈ తహశీల్దారు.
Success Story: ఈ పరిస్థితులే.. నన్ను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయ్..
నాగార్జున కోడలు క్యాన్సర్ వల్ల రెండేండ్ల క్రితం చనిపోయింది. ఆ సంఘటన ఆయనను కదిలించింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఎవ్వరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో ‘మౌనిక ఫౌండేషన్’ స్థాపించారు. ఉదయం 10.30 నుంచి తహశీల్దారుగా ఆయన విధి నిర్వహణ ఆరంభం అవుతుంది. ఆ సమయానికంతా శిక్షణ తరగతులు పూర్తవుతాయి. ప్రతి బ్యాచ్‌కు రూ.50వేల నుంచి లక్ష వరకూ పారితోషికం వస్తుంది. ‘తెలంగాణ ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని వార్షిక కాంట్రాక్టు కింద మరొకరికి ఇచ్చేశారు. ప్రచురణకర్తల నుంచి రూ.10 లక్షలు వచ్చాయి. దానికితోడు స్నేహితులు మరో రూ.10 లక్షలు సమకూర్చారు. పుస్తకాలు, యూట్యూబ్, కోచింగ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కు కేటాయించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బోధన, పుస్తకాలు తనకు అత్యంత ఇష్టమైన వ్యాపకాలనీ, సేవ తన బాధ్యత అనీ అంటారు నాగార్జున రెడ్డి.
TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా..
నైపుణ్యం ఉన్నా పేదరికం వల్ల ఎలాంటి ఉపాధీ లభించక ఇబ్బంది పడుతున్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీనికోసం ప్రతీనెల ‘మంత్లీ చాలెంజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాగార్జున అండ్ ఫ్రెండ్స్. ప్రతీనెల ఒక కుటుంబాన్ని ఎంపికచేసి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తున్నారు. మంత్లీ చాలెంజ్ కాన్సెప్ట్ నచ్చి ప్రభుత్వ ఉద్యోగులు, స్నేహితులు తలా ఓ చేయి వేసేందుకు కలిసి వస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అన్నది వారి నినాదం. ఇటీవల ఒక చిరుద్యోగి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు. విషయం తెలుసుకొని నాగార్జున రెడ్డి మిత్రబృందం ఆ కుటుంబానికి రూ.5 లక్షల సహాయం చేశారు. ఇలాంటి వితరణలు ఎన్నో చేశారు.
TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ సిలబస్ ఇదే..!
నా ప్రొఫైల్ :
☛ పదో తరగతి : 465 / 600
☛ ఇంటర్మీడియట్ : 885 / 1000
☛ గ్రూప్ -2 మార్కులు : 360 / 500
Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్నట్టే కొట్టా..