Success Story : గ్రూప్-2 కొట్టా.. అన్న మాట నిలబెట్టా
సాధారణ రైతు బిడ్డ నుంచి తహసీల్దార్ వరకు సాగిన ఆమె ప్రయాణం గురించి అనుభవాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ తో పంచుకున్నారిలా..
ప్రశ్న. మీ కుంటుంబ నేపథ్యం ఏమిటి..?
జ. నాన్న మర్యాద లింగారెడ్డి రైతు. తల్లి సుజాత అంగన్వాడీ టీచర్. వాళ్లకి ముగ్గురం ఆడపిల్లలమే. అక్క, చెల్లి, నేను. పీజీ తర్వాత నాకు వివాహం జరిగింది. భర్త రవీందర్ రెడ్డి. మాకు ఒక పాప.
ప్రశ్న. మీ విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జ. మాది నల్గొండ జిల్లా డిండి మండలంలోని ప్రతాప్ నగర్. అక్కడ పాఠశాల అవకాశం లేకపోవడంతో మా అమ్మ వద్దే అక్క, నేను చదువుకున్నాం. అనంతరం మా చదువు కోసం దేవరకొండకి మారాం. ఓ పాఠశాలలో మూడో తరగతి చేరాను. అక్కడే ఇంటర్ వరకు పూర్తి చేశా. అనంతరం అక్కడ డిగ్రీ సైన్స్ కోర్సు అందుబాటులో లేకపోవడంతో హైదారాబాద్ లోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ చేరాను. అనంతరం ప్రోద్బలంతో బీఈడీ చేశా. అనంతరం పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశా.
ప్రశ్న. ఎప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు?
జవాబు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి సేవ చేయాలని డిగ్రీలో నిర్ణయించుకున్నా. దానికి నాన్న సలహాతో బీఈడీలో చేరా. ఆ సమయంలో నాన్న మరణించడంతో కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ కలని వదిలేశాను. అనంతరం ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఫార్మా కంపెనీలో ఏడు సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం చేశాను. అప్పటికి నాకు వివాహం అయ్యింది. కానీ ఎదో వెలితి. నేను ఇది కాదని, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తానని నా భర్తకి చెప్పి ఉద్యోగానికి 2013లో రాజీనామా చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గ్రూప్-2 కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో.. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో సిలబస్ కూడా మారింది. కనిష్క ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను. ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మెటీరియల్, చెప్పిన పాఠాలు నా విజయానికి తోర్పడ్డాయి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ప్రశ్న. మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది ?
జవాబు. నా ప్రిపరేషన్ సమయంలో నాకు చిన్న పాప ఉంది. తన బాధ్యతని నా భర్త, పుట్టింటి తరుపువాళ్లు, అత్తింటి వాళ్లు తీసుకున్నారు. నా భర్త నేను చదువు కోవడం కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. అలాగే నాకు అవసరమైన మెటీరియల్ ఎప్పటికప్పుడూ తీసుకొచ్చి ఇచ్చేవారు. వారి ప్రోత్సాహంతోనే నేను డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించగలిగాను.
Motivational Story: ఇద్దరు మిత్రులు.. ఓ ఆసక్తికర స్టోరీ.. !
ప్రశ్న. మీ ఇంటర్వూకి ఎలా సాగింది ?
జవాబు. చాలా సార్లు నాకు నేనే ఇంటర్వూ చేసుకునేదాన్ని. దాంతో కొత్తగా అనిపించలేదు. ప్యానెల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నవ్వుతు, ధీమాగా సమాధానాలు ఇవ్వగలిగాను.
ప్రశ్న. మీరు ఏయే పుస్తకాలు చదివారు..?
జవాబు. తెలుగు అకాడమీ బుక్స్ తో పాటు మరో కంపెనీ మెటిరీయల్ తీసుకున్నాను. మొదట అకాడమీ బుక్ చదివి, అనంతరం ఇంకో దాంట్లో అదే ఛాప్టర్ చదవడం వల్ల రివిజన్ అవుతుండేది. అందుకే ఎవరూ సమాధానం ఇవ్వలేని కొన్ని ప్రశ్నలను నేను చేయగలిగాను.
Group 1 Ranker: ఆన్‌లైన్ కోచింగ్..గ్రూప్–1 ఉద్యోగం
ప్రశ్న. మీ రోల్ మోడల్ ఎవరు?
జవాబు. మా నాన్న మర్యాద లింగారెడ్డి నా రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద నిలబడాలని, పక్కవారికి చేతనైనా సహాయం చేయాలని ఆయన చెప్పిన మాటలే నన్ను పెళ్లైన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించేలా చేశాయి.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ప్రశ్న. గ్రూప్స్ రాయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి..?
జవాబు. ముందుగా వారిపై వారికి సాధించగలమనే నమ్మకం ఉండాలి. అనవసరంగా ఆందోళన పడకూడదు. అలా చేస్తే చదివింది మర్చిపోయే అవకాశం ఉంది. కొందరు ఏం తినకుండా ఖాళీ కడుపుతో వెళ్లి పరీక్ష రాస్తుంటారు అది మంచిది కాదు. కచ్చితంగా తిని వెళ్లాలి.
ప్రశ్న. మీ లక్ష్యం ?
జవాబు. నాకు సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయడం. గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..