Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి పోటీ పరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్ సెంటర్‌లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి.
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండవ్.. కానీ
మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్ సెంటర్‌లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్–1 మొదలుకొని గ్రూప్–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
ఏ కోచింగ్ సెంటర్ మంచిదంటే..
ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కోచింగ్ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్‌లైన్ శిక్షణ సంస్థలు, యూట్యూబ్ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్‌లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్ సెంటర్‌లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో గ్రూప్–1కు రూ.70 వేలు.. గ్రూప్ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్ ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది.
ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్ సెంటర్‌లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్‌లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి.
ఇక్కడి నుంచి చదవాల్సిందే..
సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్‌లో లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్ పైన ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్ కేంద్రాల నుంచి లభించే మెటీరియల్ మంచిదే. కానీ గ్రూప్ –1 నుంచి గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్ రూపొందించుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్
పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు..
సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలి.
టీఎస్‌పీఎస్సీ ప్రివియస్ పేపర్స్
ఈ పుస్తకాలను మాత్రమే..
ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్–1, గ్రూప్–2, వంటి పరీక్షల కోసం చదివే వాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి అంశాల్లో శిక్షణ తప్పనిసరిగా అవసరం.
– వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు
కొత్తగా ప్రిపేరయ్యే అభ్యర్థులు మాత్రం..
ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్ సెంటర్‌ల ఎంపిక ఎంతో కీలకం.
– కేవీఆర్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ
శాఖలవారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య..
శాఖ |
పోస్టులు |
హోం శాఖ |
18,334 |
సెకండరీ విద్య |
13,086 |
వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం |
12,755 |
ఉన్నత విద్య |
7,878 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
4,311 |
రెవెన్యూ |
3,560 |
ఎస్సీ అభివృద్ధిశాఖ |
2,879 |
నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ |
2,692 |
గిరిజన సంక్షేమం |
2,399 |
మైనారిటీ సంక్షేమం |
1,825 |
పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ |
1,598 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
1,455 |
కారి్మక, ఉద్యోగ |
1,221 |
ఆర్థిక శాఖ |
1,146 |
మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు |
895 |
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి |
859 |
వ్యవసాయం, సహకార |
801 |
రవాణా, రోడ్లు మరియు భవనాలు |
563 |
న్యాయ శాఖ |
386 |
పశుసంవర్థక, మత్స్య శాఖ |
353 |
సాధారణ పరిపాలన |
343 |
పరిశ్రమలు, వాణిజ్యం |
233 |
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక |
184 |
ప్రణాళిక శాఖ |
136 |
ఆహార, పౌర సరఫరాల శాఖ |
106 |
లెజిస్లేచర్ |
25 |
ఇంధన |
16 |
మొత్తం |
80,039 |
జిల్లాస్థాయి పోస్టుల సంఖ్య ఇలా..
జిల్లా |
పోస్టులు |
హైదరాబాద్ |
5,268 |
నిజామాబాద్ |
1,976 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి |
1,769 |
రంగారెడ్డి |
1,561 |
కరీంనగర్ |
1,465 |
నల్లగొండ |
1,398 |
కామారెడ్డి |
1,340 |
ఖమ్మం |
1,340 |
భద్రాద్రి కొత్తగూడెం |
1,316 |
నాగర్‌కర్నూల్ |
1,257 |
సంగారెడ్డి |
1,243 |
మహబూబ్‌నగర్ |
1,213 |
ఆదిలాబాద్ |
1,193 |
సిద్దిపేట |
1,178 |
మహబూబాబాద్ |
1,172 |
హన్మకొండ |
1,157 |
మెదక్ |
1,149 |
జగిత్యాల |
1,063 |
మంచిర్యాల |
1,025 |
యాదాద్రి భువనగిరి |
1,010 |
భూపాలపల్లి |
918 |
నిర్మల్ |
876 |
వరంగల్ |
842 |
ఆసిఫాబాద్ |
825 |
పెద్దపల్లి |
800 |
జనగాం |
760 |
నారాయణపేట |
741 |
వికారాబాద్ |
738 |
సూర్యాపేట |
719 |
ములుగు |
696 |
జోగుళాంబ గద్వాల |
662 |
రాజన్న సిరిసిల్ల |
601 |
వనపరి |
556 |
మొత్తం |
39,829 |
గ్రూప్-1,2,3,4 పోస్టుల సంఖ్య ఇలా.. :
గ్రూపు |
పోస్టులు |
గ్రూప్– 1 |
503 |
గ్రూప్– 2 |
582 |
గ్రూప్– 3 |
1,373 |
గ్రూప్– 4 |
9,168 |
టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్
జోనల్ పోస్టుల లెక్క ఇదీ..
జోన్ |
పోస్టులు |
జోన్–1 కాళేశ్వరం |
1,630 |
జోన్–2 బాసర |
2,328 |
జోన్–3 రాజన్న |
2,403 |
జోన్–4 భద్రాద్రి |
2,858 |
జోన్–5 యాదాద్రి |
2,160 |
జోన్–6 చారి్మనార్ |
5,297 |
జోన్–7 జోగుళాంబ |
2,190 |
మొత్తం |
18,866 |
మల్టీజోన్ పోస్టుల లెక్క ఇదీ..
కేడర్ |
పోస్టులు |
మల్టీజోన్–1 |
6,800 |
మల్టీజోన్–2 |
6,370 |
మొత్తం |
13,170 |
వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు