TS Revenue Department Jobs 2024 : రెవెన్యూ శాఖలో కొత్తగా 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు ఇవే...
ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ..
ఈ పోస్టుల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10 వేల 54 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. దీంతో 5000 మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయిలో విచ్చిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడినపెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చదివి.. టీచర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !
డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలను..
గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్వో, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం వంటి పనులు చేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు.
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ 2024ను చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తున్నది. అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించబోతున్నరానే విషయాన్ని ప్రకటించునున్నట్లు సమాచారం.
గ్రామానికొక రెవెన్యూ అధికారి ఉంటే..
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్న పోస్టుల డ్యూటీ చార్జ్‌లో చేర్చనున్నట్లు తెలిసింది. గ్రామానికొక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్‌కం వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు సమాచారం.
ఈ పోస్టుల్లోనే వారికే..
ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్‌లో అసిస్టెన్స్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టుల్లోనే వారికే అప్పగించేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2020 అక్టోబర్‌కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి. రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గ్రామాల్లో రెవెన్యూ సేవలను కొనసాగించడానికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమిస్తం. ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
త్వరలోనే వీఆర్వోల నియామకం...
రాష్ట్రంలో 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారి లేక వీఆర్వోలను నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్న ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు, 970 తహసీల్దార్లతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్‌ఏ వ్యవస్థలు కలిపి రాష్ట్రంలో 25 వేలకు పైగా పోస్టులు ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయగా.. వారిని ఇతర శాఖలకు బదలాయించిందని, ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు.
Tags
- TS Government Jobs 2024 news
- TS Government Jobs 2024 Notifications
- Telangana Revenue Department Jobs 2024
- Telangana Revenue Department Jobs 2024 News in Telug
- telangana revenue department minister
- telangana revenue department minister ponguleti srinivas reddy
- ponguleti srinivas reddy jobs revenue jobs announcement
- telangana revenue minister 2024 announcement jobs vacancy
- telangana revenue minister 2024 announcement jobs vacancy news telugu
- Telangana 5000 Revenue Department Jobs 2024 Notification Details News
- Telangana 5000 Revenue Department Jobs 2024 Notification
- Telangana 5000 Above Revenue Department Jobs 2024 Notification
- TS government jobs
- ts government
- ts government jobs notification 2024
- ts government jobs notification 2024 telugu news
- ts government jobs notification 2024 released
- ts government jobs notification 2024 released news telugu