Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ
Sakshi Education
జగిత్యాల రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ యువతి పట్టుదలతో చదివి, మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన ముదుగంపల్లి భారత–చంద్రయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, రెండో కూతురు జయ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని, బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది.
Thotapalli Jyothi: పట్టుదలతో చదివి.. రెండు ప్రభుత్వ కొలువులు పట్టి
అక్కడ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్‌లో మంచి ర్యాంక్ ద్వారా హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైంది. ఏఈఈ ఉద్యోగంలో చేరతానని తెలిపింది.
Published date : 08 Aug 2024 11:31AM
Tags
- TS government jobs
- Government Jobs
- State government job
- AEE
- Telangana News
- AEEPanchayatiRaj
- Group4Selection
- Group4Verification
- RecentExamResults
- JobSelectionResults
- WomenEmpowerment
- sakshieducation success stories
- Jagityalarural
- GovernmentJobSelection
- PanchayatiRajDepartmentAEE
- MunicipalityTownPlanningOfficer
- AssistantEngineer
- YoungWomanSuccess
- RuralSuccessStories
- GovernmentJobAchievements
- JobOpportunities
- RuralJobSuccess
- sakshieducation success stories