Skip to main content

Anganwadi jobs: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు..10వ తరగతి అర్హతతో

Anganwadi jobs
Anganwadi jobs

వైఎస్సార్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు..

Army Public School jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో భారీగా ఉద్యోగాలు: Click Here

వైఎస్సార్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు..
మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 4
అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 59
అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులు: 11

అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు
ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17, 2024వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తులను వైఎస్సార్‌ జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి. ఏడు, పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సెప్టెంబర్‌ 28, 2024వ తేదీన ఉంటుంది. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.. అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సెలక్షన్‌ ఇలా..
పదో తరగతిలో వచ్చిన మార్కులకు 50, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు 5 మార్కులు, విడో మహిళ అయితే 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన విడో మహిళకు 5 మార్కులు, అనాథ లేదా బాలా సథన్‌లో చదివిన వారికి 10 మార్కులు, వికాలాంగులకు 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకి 20.. ఇలా మొత్తం 100 మార్కులకు జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలో మార్కులు ఇస్తారు. మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published date : 14 Sep 2024 08:19PM

Photo Stories