Skip to main content

Army Public School jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో భారీగా ఉద్యోగాలు

Army Public Schools jobs
Army Public Schools jobs

దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో భారీ సంఖ్యలో టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులను రెగ్యులర్ మరియు ఫిక్స్‌డ్ టెర్మ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బొల్లారం, గోల్కొండ, ఆర్కేపురం లలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కలవు.

ఈ టీచింగ్ పోస్టులను ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ – 2024 (AWES OST 2024) ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 25 – 2024 తేదీ వరకు ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)

పీఆర్టీ (ప్రైమరీ టీచర్)

సబ్జెక్టులు : బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎస్ఈడీ, బీఈఎస్ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత తో పాటు, సీటెట్, టెట్ అర్హత తప్పనిసరి.

వయో పరిమితి: 01-04-2024 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్లలోపు వారు, అనుభవజ్ఞులైన వారు అయితే అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 385/- రూపాయలు

దరఖాస్తు విధానం: Online ద్వారా

దరఖాస్తుకు గడువు: 10-09-2024. నుంచి 25-10-2024 వరకు

పరీక్ష తేదీ: 23, 24 -11-2024.

ఫలితాల వెల్లడి తేదీ: 10-12-2024.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్.

Published date : 14 Sep 2024 07:22PM
PDF

Photo Stories