Education News:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్:కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీని వల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవుతుందన్నారు. సులభంగా అప్లూ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులపై భారాన్ని తగ్గించడం .. ఒకే వేదికపై దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని అందించడం, తద్వారా వారి సమయం మరియు శక్తి ఆదా చేయడం దీని లక్ష్యం.ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధి 15 నెలల నుంచి 8 నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటి వరకు 89 లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.
పోర్టల్ ముఖ్య లక్ష్యాలు:
- అభ్యర్థులకు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచడం.
- వివిధ శాఖలు, విభాగాలు, మరియు ఏజెన్సీలలో ఖాళీలను ఒకేచోట ప్రదర్శించడం.
- దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసి, సమయం ఆదా చేయడం.
లాభాలు:
- అభ్యర్థులు ఒకే దరఖాస్తు ద్వారా పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం.
- వివిధ పరీక్షలకు సంబంధిత సమాచారం మరియు అప్డేట్‌లు వేగంగా అందించడం.
- పారదర్శకత పెంచి, భర్తీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం.
ఈ పోర్టల్ ద్వారా SSC, UPSC, RRB, IBPS వంటి సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఈ పోర్టల్ ప్రారంభ తేదీ, విధివిధానాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- A special portal to apply for central government jobs at one place: Union Minister Jitendra Singh
- Union Minister Jitendra Singh
- Jitendra Singh
- Central Government Jobs
- Single job application portal
- Central Government Recruitment
- Government Recruitment
- Education News
- EmploymentOpportunities
- RecruitmentProcess
- GovernmentJobsIndia