Skip to main content

CIPET CAT 2025 Notification : సీఏపీఈటీ క్యాట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అడ్మిష‌న్ ప్రాసెస్ ఇదే..

సీఐపీఈటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.
CIPET CAT entrance exam notification with details in telugu

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (సీఐపీఈటీ) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు, ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు అధికారులు. నోటిఫికేష‌న్‌లోని వివ‌రాల‌ను ప‌రిశీలించి, ప్ర‌క‌టించిన తేదీలోగా ద‌ర‌ఖాస్తులు పూర్తి చేసుకోవాల‌ని సూచించారు.

CUET UG 2025 Application Correction Window Opens: CUET అప్లికేషన్‌ ఫారమ్‌లో కరెక‌్షన్స్‌కు అవకాశం.. చివరి తేదీ ఎప్పుడంటే..

ఇక‌, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగంలో పరిశ్రమ-సంబంధిత నైపుణ్యాలు,  జ్ఞానాన్ని పొందడానికి ఇది మీకు అవకాశం! అయితే, అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్‌ను ప‌రిశీలించి, ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవాల‌ని తెలిపింది.

కోర్సు వివ‌రాలు..

డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాల‌జీ: ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త త‌ప్ప‌నిసరి, 3 ఏళ్ల కోర్సు వ్య‌వ‌ధి.

డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ (డీపీటీ): ప‌ద‌వ త‌ర‌గతి త‌ప్ప‌నిస‌రి, 3 ఏళ్ల వ్య‌వ‌ధి.

పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రొసెసింగ్ అండ్ టెస్టింగ్‌: డిగ్రీ విద్యార్హ‌త త‌ప్ప‌నిస‌రి, 2 ఏళ్ల కోర్సు వ్య‌వ‌ధి.

పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ CAD/ CAM (PD PMD with CAD/ CAM): డ‌ఇడిప్లొమా విద్యార్హ‌త‌, అర్థ సంవత్స‌ర (ఆరు నెల‌లు) కోర్సు వ్య‌వ‌ధి.

Jobs in ITES India : ఐటీఈఎస్‌లో 20 శాతం మెర‌ పెర‌గ‌నున్న ఉద్యోగావ‌కాశాలు.. నివేదిక విడుద‌ల‌..

సీఐపీఈటీ సీఏటీ 2025 ముఖ్య‌వివ‌రాలు..

- వ‌యోపరిమితి లేదు.

- ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో.. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి చేసుకోవాలి.

- ద‌ర‌ఖాస్తుల చివ‌రి తేదీ: మే 29, 2025

- దేశ‌వ్యాప్తంగా సీఏటీ ప‌రీక్ష‌: జూన్ 8, 2025

మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Mar 2025 03:27PM
PDF

Photo Stories