Skip to main content

Software jobs for local youth: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ స్థానిక యువకులకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

local youth jobs
local youth jobs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ స్థానిక యువకులకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

2022లో జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఎన్టీటీ బిజినెస్‌ డాటా సొల్యూషన్స్‌, బీడీఎన్టీ అనే రెండు కంపెనీలు ఏర్పాటయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో పశుసంవర్ధక శాఖ కార్యాలయ భవనంలో తాత్కాలికంగా ఎన్టీటీ డేటా కంపెనీ ప్రారంభమైంది. మొదట్లో 87 మందితో మాత్రమే ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 265 మంది ఉద్యోగులు ఉండడం విశేషం. ఈ కంపెనీకి అంతర్జాతీయంగా ప్రతీ దేశంలో పదుల సంఖ్యలో శాఖలు ఉండడం సంస్థ ప్రాధాన్యతను తెలియజేస్తోంది.సంస్థ ద్వారా ముఖ్యంగా ఎస్‌ఏపీ సేవలు అందజేస్తున్నారు. అలాగే ఎన్టీటీ సహకారంతో బీడీఎన్టీ సంస్థ సైతం సేవలు అందిస్తోంది.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ రిటైర్‌మెంట్‌ ఏజ్‌ పెంపు: Click Here

నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే తొలి ఐటీస్టార్ట్‌అప్‌ కంపెనీ కావడం విశేషం. ఇందులో 100 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ప్రొడక్ట్‌ డెవలప్మెంట్‌, వెబ్‌సైట్‌ డెవలప్మెంట్‌, రిక్రూట్‌మెంట్‌ అండ్‌ స్టాఫింగ్‌, డిజిటల్‌ మార్కెట్‌, సాప్‌ వంటి సేవలు ఆటంకం లేకుండా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీ నైపుణ్యం గల నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ అందిస్తూ, పలు ఐటీ సంస్థల్లో నియామకాలు చేస్తోంది. ఈ విధంగా ఎంతోమంది యువత లబ్ధి పొందుతున్నారు.

జిల్లాలోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూ.40 కోట్లతో టవర్‌ నిర్మాణం ప్రారంభించింది. జిల్లాలోని మావల మండలం బట్టి సవర్గాం శివారులో మూడెకరాల స్థలంలో 50వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం వేగవంతంగా సాగుతున్నాయి. మరికొద్ది నెలల్లో టవర్‌ అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తయితే ఐటీ కంపెనీలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుకానున్నాయి.

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

ప్రస్తుతం కంపెనీలో కోడింగ్‌, ప్రాజెక్ట్స్‌, అప్లికేషన్‌, శాప్‌ వంటి సేవలను ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా అందిస్తున్నాం. ఆదిలాబాద్‌ వంటి టైర్‌–2 పట్టణాల్లో సైతం ఐటీ సేవలు అందించడం వలన స్థానిక యువతకు ఉపాధి లభ్యమవుతుంది. విశాలమైన భవనం ఉండి, అన్ని సౌకర్యాలు ఉంటే మరింత విస్తృతంగా సేవలు అందించవచ్చు. –మానస, హెచ్‌ఆర్‌, ఎన్టీటీ

కుటుంబాలకు దగ్గరగా..

ఐటీ కంపెనీలో ఇంజినీరింగ్‌ చేసిన వరకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ సాధారణ డిగ్రీ పూర్తి చేసినా, అభ్యర్థికి టెక్నాలజీపై పట్టు ఉంటే వారిని నియమించుకొని శిక్షణ అందజేసి ఉద్యోగాన్ని అందిస్తుండడం మంచి విషయం. దూర ప్రదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం కంటే ఇక్కడే కుటుంబానికి దగ్గరగా ఉంటూ పని చేసుకోవడం మాలాంటి యువతకు ఎంతో ప్రోత్సహకారంగా ఉంటుంది. 

స్థానికులకు ప్రాధాన్యం..

నేను గతంలో హైదరాబాద్‌లో ఆరేళ్లపాటు ఐటీ సెక్టర్‌లో పనిచేశాను. అయితే జిల్లా కేంద్రంలో కంపెనీ ఏర్పడడంతో ఇక్కడే ఉద్యోగిగా చేరాను. ప్రస్తుతమున్న కంపెనీలు సైతం స్థానికులకే ఎక్కువగా ప్రా ధాన్యమిస్తున్నాయి. హైదరాబాదులో లభించే వేతనంతో ఇక్కడే కొలువు సాధించడం సంతోషంగా ఉంది. మరిన్ని కంపెనీలు ఏర్పడితే స్థానికంగా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఎంతోమందికి మేలు చేకూరుతుంది.

శుభ పరిణామం..

ఐటీ రంగంలో యువతులు సైతం రాణిస్తున్నారు. అయితే దూర ప్రాంతా లకు వారిని పంపించేందు కు పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి యువతులు, గృహిణులకు స్థానికంగా ఐటీ కంపెనీ ఏర్పడడం శుభపరిణామంగా చెప్పవచ్చు. గృహిణులు కూడా ప్రస్తుతం ఆదిలా బాద్‌ కంపెనీల్లో ఎలాంటి సమస్య లేకుండా ఉద్యోగాలు చేస్తుండడం మహిళా సాధికారత దిశగా ముందడుగుగా భావించవచ్చు. – శ్రీ విద్యారెడ్డి, మేనేజర్‌, బీడీఎన్టీ
 

Published date : 20 Nov 2024 08:27PM

Photo Stories