DEO Visits Government School: ఆకస్మికంగా పాఠశాలను సందర్శించిన డీఈఓ..వారికి ప్రత్యేక తరగతులు
Sakshi Education
నంద్యాల(న్యూటౌన్): ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని టెక్కె పురపాలక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
DEO Visits Government School
పదవ తరగతి సిలబస్, ఫలితాల పెంపు, మధ్యాహ్న భోజనం తదితర వాటిపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి టీచర్ అర్థవంతంగా విద్యాబోధన చేసి వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. ఎవరైనా విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బ్రహ్మంనాయక్, సీఆర్పీలు పాల్గొన్నారు.