Skip to main content

Education Department : పాఠ‌శాల‌లు.. విద్యార్థులు.. టీచ‌ర్లు.. లెక్క సేక‌రిస్తున్న విద్యాశాఖ‌.. ఎందుకంటే!

Education department inspection on schools teachers and students

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌ల‌కు టీచ‌ర్లు ఎంత‌మంది వ‌స్తున్నారు..? విద్యార్థులు ఎంత మంది చేరుతున్నారు..? అస‌లు పాఠ‌శాల‌ల్లో విధులు, పాఠాలు ఎలా సాగుతున్నాయ‌ని విద్యాశాఖ ఆరా తీసింది. ఇటువంటి వివ‌రాల‌ సేక‌ర‌ణ‌లో 2024-25 విద్యాసంవత్సరంలో 1,899 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్ రోల్స్ మెంట్స్ జరిగాయని, ఒక్క విద్యార్థి కూడా ప్ర‌వేశించ‌లేద‌ని అధికారుల‌కు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ జీరో ఎన్ రోల్ మెంట్ జరిగిన స్కూళ్లలో మాత్రం 580 మంది టీచర్లు విధుల్లో ఉన్నార‌ని, అయితే వారిని అవ‌స‌ర‌మున్న పాఠ‌శాల‌ల‌కు స‌ర్దుబాటు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

విద్యాసంవ‌త్స‌రంలో ప‌ది మందిలోపు విద్యార్థులు..

పాఠ‌శాల‌లోని టీచ‌ర్ల‌ను అవ‌స‌రం ఉన్నచోట్లకు స‌ర్దుబాటు చేయ‌గా, కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చేరిన పాఠశాలల సంఖ్య 53 ఉండగా టీచర్లు 51 మంది ఉన్నారు. ఇలా, ఈ విద్యాసంవత్సరంలో పది మందిలోపు విద్యార్థులు చేరిన పాఠశాలలు మొత్తం 4324 స్కూళ్లు ఉండగా, టీచ‌ర్ల సంఖ్య 3326 ఉంది.

పాఠ‌శాల‌లు.. విద్యార్థులు.. టీచ‌ర్లు..

తెలంగాణలో మొత్తం 26,101 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం టీచర్లు 1,06,641 మంది ఉన్నారు. అందులో ప్రైమరీ స్కూళ్లు మొత్తం 18,254 ఉండగా టీచర్లు 40,591 మంది ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 3,142 ఉండగా 13,871 మంది టీచర్లు ఉన్నారు. అలాగే హైస్కూళ్ల సంఖ్య 4,705 ఉండగా టీచర్లు 52,179 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉపాధ్యాయుల స‌ర్దుబాటు

ప్రతి స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరంలో జీరో ఎన్ రోల్ మెంట్ అయిన 1899 స్కూళ్లలో ప్రైమరీతో పాటు అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లు సైతం ఉండటం గమనార్హం. జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 1818 గా ఉంది.అందులో టీచ ర్లు 517 మంది ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 48 ఉండగా టీచర్లు 33 మంది, హైస్కూళ్లు 33 ఉండగా టీచర్ల సంఖ్య 30 గా ఉంది.

Published date : 11 Dec 2024 02:58PM

Photo Stories