Skip to main content

Out Sourcing Employees : జీతాలు లేవు.. ఆవేద‌న‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఇక అప్పులేనా..!

ప్రతీ ఉద్యోగికి నెలాక‌రిలోనే జీతాలు ప‌డ‌తాయి. ఒక‌వేళ‌, ఆఖ‌రిలో సెల‌వున్నా.. ముందురోజే జాతాల‌ను పంచేస్తారు. కాని, ఇక్క‌డ నెలదాటి, ప‌ది రోజుల‌వుతున్న‌ప్ప‌టికీ ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఇంకా జీతాలు రాలేదు.
Lack of salaries for out sourcing employees in ap

సాక్షి ఎడ్యుకేష‌న్: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దాదాపు 300 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వారిలో స్టాఫ్‌ నర్సులతో పాటు, నాల్గో తరగతి ఉద్యోగులు, కంప్యూటర్‌ ఆపరేటర్‌లూ ఉన్నారు. వీరంద‌రికీ, ప్ర‌తీ నెల అంద‌రికీ ప‌డిన‌ట్టే జీతాలు ప‌డ‌తాయి. కాని, ఈసారి మాత్రం డిసెంబ‌ర్ నెల వ‌చ్చి ప‌దో తారీకు కూడా దాటిపోయింది కాని, ఇప్ప‌టివ‌ర‌కు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు ప‌డ‌లేదు. దీంతో, ఉద్యోగులంతా జీతాలు ఎప్పుడెప్పుడెప్పుడు ప‌డ‌తాయా అని ఎదురుచూస్తున్నారు.

Job Opportunities In 2025 Report: ఐటీ జాబ్‌ కోసం చూస్తున్నారా? 2025లో భారీగా నియామకాలు

జీతాల‌తో అవ‌స‌రాలు..

ప్ర‌తీ నెల ఒక‌టో తేదీకే అంద‌రికీ జీతాలు ప‌డ‌తాయి. దీంతో చిరుద్యోగులు వారికి ఉన్న ఈఎంఐలు, ఇంటి అద్దెలు, ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి, వంటి వివిధ అవ‌స‌రాలు అంటాయి. వీటిని, నెల ప్రారంభంలో తీర్చేస్తారు. కాని, ఈసారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు న‌వంబ‌ర్ నెల దాటిపోయి డిసెంబ‌ర్ నెల‌లో 10వ తేదీ కూడా అయిపోయింది కాని, ఇంత‌వ‌ర‌కు రావాల్సిన జీతాలు రాలేదని వాపోతున్నారు.

Education Department : పాఠ‌శాల‌లు.. విద్యార్థులు.. టీచ‌ర్లు.. లెక్క సేక‌రిస్తున్న విద్యాశాఖ‌.. ఎందుకంటే!

ఇక అప్పులేనా..!

ఉద్యోగులంద‌రినీ నెల‌లో మొద‌టి తారీకు రాగానే జీతాలు వారి ఖాతాలో ప‌డ‌తాయి. ఇక వారంతా వారికి ఉన్న చిన్న చిన్న అవ‌స‌రాలు, ఈఎంఐలు, ఇంటి అద్దెలు చెల్లించ‌డం, చిన్న చిన్న రుణాలు తీసుకుంటారు. అయితే, ఈ నెల జీతం ఇంకా అంద‌క‌పోవ‌డంతో అనేక మంది ఉద్యోగులు అప్పుల బారిన ప‌డుతున్నారు. అవుట్‌సోర్సింగ్‌లో ఉన్న వారు.. మేమంతామంతా చిరుద్యోగులమేనని, తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని వారి ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

గ‌తంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదని, ప్ర‌తీ నెల మొద‌టి తారీకు రాగానే మా ఖాతాల్లోకి మా జీతాలు చేరేవ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారి ఆవేద‌న‌ను గుర్తించి, వెంట‌నే స్పందించాల‌ని, త‌మ జీతాల‌ను స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కోరారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.

గ‌తంలో..

ఒకప్పుడు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏజెన్సీల కింద పనిచేసే వారు. వారు ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఉద్యోగులకు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. ఈ విషయాన్ని గ్రహించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.

Shaktikanta Das: ఆర్‌బీఐ గవర్నర్ ప‌ద‌వికి వీడ్కోలు ప‌లికిన శక్తికాంత దాస్

రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతినెలా పర్మినెంట్‌ ఉద్యోగుల కంటే ముందుగానే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించేవారు. దీంతో ఉద్యోగులు సైతం తమకు ప్రతినెలా జీతం వస్తుందనే ధైర్యంతో ఉండేవారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 11 Dec 2024 03:48PM

Photo Stories