Skip to main content

Railway Recruitment : ఇంట‌ర్ అర్హ‌త‌తోనే.. రైల్వేలో మంచి ఉద్యోగం.. నెల‌కు జీతం ఎంతంటే..?

రైల్వేలో ఒక జాబ్ ఎంతో కీల‌క పాత్ర పోషిస్తుంది. వారికి ఎన్నో అధికారాలు ఉంటాయి. వారెవ‌రో కాదు, మ‌నం ట్రైన్‌లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. రైలులో ఉన్నప్పుడు మ‌న వ‌ద్ద టికెట్ల‌ను ప‌రిశీలించి, సీట్ల కేటాయింపులో కీల‌క పాత్ర‌ను పోషించేవారు వారి జాబ్ పేరు టీటీఈ అంటే.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్.
Railway recruitment for intermediate passedouts

సాక్షి ఎడ్యుకేష‌న్: మ‌న రైల్వే ప్ర‌యాణంలో వీరి పాత్ర ఎంతో కీల‌కం. అటువంటి ఉద్యోగం పొందాలంటే, మ‌న‌కు ఎటువంటి అర్హ‌త‌లు ఉండాలి, ఎదైనా ప‌రీక్ష‌లు రాయాలా, ఇంకేదైనా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావాలా..? లేదా ఈ వ‌య‌సు ఉన్న వారే అర్హుల‌ని ఏదైనా వ‌యోప‌రిమితి క‌లిగి ఉందా..? ప‌రీక్ష‌ల‌కు ఎలా సిద్ధం అవ్వాలి..? అని అనేక ప్ర‌శ్న‌లు తెలెత్తుతాయి. మ‌రి ఒక‌సారి ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకుందామా..!

MIT Suspends Indian Origin Student: అమెరికాలో భారత విద్యార్థి కెరియర్‌ నాశనం.. ఆ ఫొటో కారణమా?

టీటీఈ బృందం జాబ్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగులు ఎవ‌రైనా ఉంటే వారికి ఈ అవ‌కాశం ఉంది. దీనిని వారు వినియోగించుకోవ‌చ్చు..

పోస్టు వివ‌రాలు..

విద్యార్థ‌త‌లు: ఇంట‌ర్‌లో 50శాతం మార్కులు, అదనంగా.. డిప్లొమా కోర్సును పూర్తి చేసుండాలి.

పరీక్ష వివరాలు: ఈ రిక్రూట్మెంట్‌ ప‌రీక్ష‌లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. ఇందులో, 150 మార్కులకు 150 మల్టీఫుల్ ప్రశ్నలు ఉంటాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అర్హ‌త‌లు: ఫిజిక‌ల్‌- రిక్రూట్మెంట్‌లో నిర్వ‌హించే ఫిజికల్ క్వాలిఫికేషన్స్ కు అనుగుణంగా ఉండాలి.
                  విజన్-   దూర దృష్టి: 6/9, నియర్ విజన్: 0.6/0.6 ఉండాలి.
                  ఆర్ఆర్‌బీ సూచించిన‌ అదనపు ఫిజికల్ ఫిట్‌ నెస్ పరీక్షలను పూర్తిచేయాలి.

పౌరసత్వం: అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి, దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

వేత‌నం: పే కమిషన్ నిర్ణ‌యిస్తుంది. 
               తొలిసారి గ్రేడ్ పేతో రూ. 5,200 తో కలిపి రూ. 20,200గా ఉంటుంది. రూ. 1,900 డియర్‌ నెస్ అలవెన్స్ (డీఏ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) అందిస్తారు. పే కమిషన్ ఎప్పటికప్పుడు సాలరీ పెంపును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం TTEలకు రూ. 36 వేల వరకు అందిస్తున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ప‌రీక్ష‌కు సిద్ధ‌మైయ్యే విధానం: 

1. జనరల్ నాలెడ్జ్‌పై అధిక దృష్టి సారించాలి.
2. కరెంట్ అఫైర్స్ మీద మ‌రింత ముఖ్యంగా దృష్టి పెట్టాలి.
3. రీజనింగ్ విభాగంలో మంచి స్కోర్ చేసేందుకు లాజికల్ థింకింగ్ అవసరం.
4. గ‌తంలోని ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను మీ ప్రిప‌రేష‌న్‌లో భాగం చేయ‌లి. ఇది మీ రివిజ‌న్ ముగిసిన త‌రువాత సిద్ధం అవ్వాలి.
India-Russia Defense Partnership: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ
5. మ్యాథ్స్ కు సంబంధించిన బేసిక్ ప్ర‌శ్న‌ల‌పై మ‌రింత‌ దృష్టి పెట్టాలి.
6. మీ ప్రిప‌రేష‌న్‌లో భాగంగా మాక్ టెస్టుల‌ను కూడా తీసుకోవాలి. దీంతో మీ ప్రిప‌రేష‌న్ గురించి మీకు తెలుస్తుంది.

Gita Jayanthi: నేడు గీతా జయంతి.. ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున..

Published date : 11 Dec 2024 01:07PM

Photo Stories