Job Mela: రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela
కామారెడ్డిలోని స్టాఫింగ్ టైటాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎల్ గ్రూప్ కంపనీలలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపువారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్‌లతో కలెక్టరేట్‌కు రావాలని, ఇతర వివరాలకు 76719 74009, 63039 32430, 77308 20444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.