Skip to main content

Agniveer Vayu Recruitments 2024 : అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు

Agniveer Vayu jobs    Indian Air Force Agniveer Vayu Jobs Announcement   BV Prasada Rao Announces Agniveer Airman Jobs   Opportunity for Agniveer Vayu Jobs in IAF   Indian Air Force Recruitment for Agniveer Airman
Agniveer Vayu jobs

సాక్షి ఎడ్యుకేష‌న్: అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరేందుకు ఇదే మంచి అవ‌కాశం.. దీనిని స‌ద్వినియోగం చేసుకోండి. భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీకి, ద‌రఖాస్తులకు సంబంధించిన వివ‌రాల‌ను ప‌రిశీలించండి..

10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్‌లో 4232 ఉద్యోగాలు: Click Here

అర్హ‌త‌: ఇంటర్మీడియట్‌, పదో తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్య‌ర్థులు.

వ‌యోప‌రిమితి: 2005 జనవరి ఒకటో తేదీ నుండి 2008 జూలై ఒకటి మధ్య పుట్టిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు.

అర్హ‌త ప‌రీక్ష‌: ఆన్‌లైన్‌ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్‌ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ-మెయిల్‌కు వస్తాయి.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ: 2025 జనవరి 7వ తేదీ నుంచి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. 

అధికారిక వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

Published date : 31 Dec 2024 08:49AM

Photo Stories