Skip to main content

Junior Lecturers : జూనియ‌ర్ క‌ళాశాలలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల జాబితా.. త్వ‌ర‌లోనే..

సంవత్సరం మారింది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల రూపురేఖలు కూడా మారనుంది.
Junior lecturers posts at junior colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్పుడూ లేని విధంగా తొలిసారి సర్కారు కాలేజీలలో 1,239 మంది అభ్య‌ర్థులకు శాశ్వత అధ్యాపకులుగా త్వ‌ర‌లో విద్యార్థుల‌కు బోధించేందుకు విధుల్లో చేరనున్నారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) ఇంటర్‌ విద్యాశాఖకు అందజేసింది.

1289 Jobs: ఏపీ డీఎంఈలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.97,750 జీతం..

మ‌రో 15 రోజుల్లో..

నిజానికి, 1,392 మంది నియామకాలకు ఇప్పుడు కాదు, 2022 డిసెంబరులోనే టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన‌ప్ప‌టికీ.. పలు కారణాల వల్ల‌ అప్పటి నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. ఆంగ్లం సబ్జెక్టుపై వ్యాజ్యం నమోదైన నేపథ్యంలో 153 పోస్టులు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో మిగతా పోస్టులకు ఎంపికైన వారి నియామక ప్రక్రియను చేటప్పారు. ఈ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన వచ్చే 10-15 రోజుల్లో జరగనున్నట్లు సమాచారం. ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి ఆ వెనువెంటనే పోస్టింగ్‌ ఇస్తామని వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోపే జూనియర్‌ లెక్చరర్లు విధుల్లో చేరే అవకాశం ఉంది.

JEE Main Exams : జేఈఈ ప‌రీక్ష‌లపై ఎన్‌టీఏ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తేదీలు ఇవే..

4,400 మంది విధుల్లో..

కాగా రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వాటిలో మంజూరైన బోధన పోస్టులు 6,008. వీటిల్లో ప్రస్తుతం 900 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్‌ ఉన్నారు. మరో 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం 4,400 మంది విధుల్లో ఉన్నారు. కొత్తగా 1,239 మంది రానున్నారు. దీంతో శాశ్వత అధ్యాపకుల సంఖ్య 5,639కి చేరుకుంటుంది. ఖాళీలు 369 మాత్రమే ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న ఆంగ్లం పోస్టులు 153 కూడా భర్తీ అయితే ఖాళీలు 216కు తగ్గుతాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 03:52PM

Photo Stories