Schools Students : అతి మొబైల్ వాడకం పిల్లలకు అనర్ధదాయకం...
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పాఠశాల నుంచే నిర్ధేశించుకోవాలన్నారు డాక్టర్ వాణి పాలకుర్తి గారు తెలిపారు.
అలాగే సీఈఓ చైతన్య గారు మాట్లాడుతూ... అతి మొబైల్ వాడకం పిల్లలకు అనర్ధదాయకమని సూచించారు. జేఈఓ అంకమ్మరావు గారు పిల్లలు ఆటపాట, చదువుల్లో ఉత్సాహాంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులే తమ పిల్లలకు రోల్ మోడల్, రియల్ హీరోలని ప్రిన్సిపాల్ అయూబ్ భాషా అన్నారు. అలాగే ఛాంప్స్ ప్రిన్సిపాల్ శ్రీమతి లౌక్య గారు స్కూల్స్ విద్యార్థులకు తమ విలువైన సందేశాన్ని ఇచ్చారు. వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు.. అత్తాపూర్ భాష్యం స్కూల్ 13వ వార్షికోత్సవ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ఎంతో ఆనందోత్సహాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరిని అలరించారు.
Published date : 04 Jan 2025 10:22AM