Skip to main content

job mela: 6న జాబ్‌ మేళా

job mela  Job fair announcement at Vikasa office in Kakinada City Freshers eligible for Junior Accountant and Accountant Executive roles  Hallmark Global Technology Company job opportunities
job mela

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌ మార్క్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీలో జూనియర్‌ అకౌంటెంట్‌, అకౌంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగా లకు బీకాం, ఎంకాం, ఎంబీఏ, సీఏ, ఇంటర్‌ ఉత్తీర్ణులైన ఫ్రెషర్స్‌ అర్హులన్నారు.

డిగ్రీ అర్హతతో NPCIL విద్యుత్ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Click Here

టాలీ, అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో అవగాహన ఉన్న పురుష అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. వరుణ్‌ మోటార్స్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు, హోండా కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వీరికి నెలకు రూ.12,800 నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌, భోజన, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తమ కార్యాలయానికి విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని లచ్చారావు సూచించారు. వివరాలకు 77993 76111 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Published date : 06 Jan 2025 08:41AM

Photo Stories