Skip to main content

NPCIL jobs: డిగ్రీ అర్హతతో NPCIL విద్యుత్ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

NPCIL jobs
NPCIL jobs

భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్,  డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) సంస్థ నుండి అప్రెంటిస్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Inter అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ , డిప్లొమా అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యన్ పి సి ఐ ఎల్) సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

మొత్తం ఖాళీల సంఖ్య : 300

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ట్రేడ్ అప్రెంటిస్:
ఫిట్టర్ – 58
ఎలక్ట్రీషియన్ – 25
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 18
వెల్డర్ – 18
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 16
కోపా / పాసా ( COPA/ PASAA) – 10
మేకానిస్ట్ – 10
టర్నర్ – 7 
ఏసీ మెకానిక్ – 7
 డీజిల్ మెకానిక్ – 7 
డిప్లొమా అప్రెంటిస్ :
కెమికల్ – 13
సివిల్ – 08
ఎలక్ట్రానిక్స్ – 02
మెకానికల్ – 06
ఇన్స్ట్రుమెంటేషన్ –  02
ఎలక్ట్రికల్ – 01
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
కెమికల్ – 19
సివిల్ – 10
ఎలక్ట్రానిక్స్ – 06
మెకానికల్ – 09
ఇన్స్ట్రుమెంటేషన్ –  05
ఎలక్ట్రికల్ – 07
బి. ఎస్సీ ఫిజిక్స్  -04 
బి. ఎస్సీ కెమిస్ట్రీ – 02 
హ్యూమన్ రిసోర్సెస్ – 05
కాంట్రాక్ట్స్ & మెటీరియల్ మేనేజ్మెంట్ – 05
ఫైనాన్స్ & అకౌంట్స్ – 04

విద్యార్హత :
ట్రేడ్ అప్రెంటిస్:  సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. 

వయస్సు :
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి  26 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
వయస్సు నిర్ధారణ కొరకు 21/01/2025 ను కట్అఫ్ తేది గా నిర్ణయించారు.

వయస్సులో సడలింపు వివరాలు : 
ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
PwBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్  విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , ప్రింట్ తీసి ,ఫిల్ చేసి క్రింది చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు తేది : 21/01/2025  లోగా కార్యాలయం చిరునామా కి చేరాలి.

దరఖాస్తు చేరవలసిన చిరునామా: Deputy Manager(HRM) NUCLEAR POWER CORPORATION OF INDIA LIMITED KAKRAPAR GUJARAT SITE Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat.       

ఎంపిక విధానం: ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:
ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 7,700/- రూపాయలు
డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 8,000/- రూపాయలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 9,000/- రూపాయలు నెలకు స్టైఫండ్ లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు: ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరుటకు చివరి తేది : 21/01/2025

Notification: Click Here

Official website: Click Here

Published date : 03 Jan 2025 08:02PM

Photo Stories