Skip to main content

Highcourt Job Notification : గుడ్ న్యూస్‌.. 1673 పోస్టుల భ‌ర్తీకి హైకోర్టు జాబ్ నోటిఫికేషన్

నూత‌న సంవ‌త్స‌రంలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ఎదురైంది.
Telangana High Court announces recruitment for various court vacancies  Highcourt job notification with 1673 posts in various courts in telangana

సాక్షి ఎడ్యుకేష‌న్: నూత‌న సంవ‌త్స‌రంలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ఎదురైంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు ఉద్యోగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాలను పార్టీ ఏ, పార్టీ బీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ ప్రకటన: తెలంగాణ హైకోర్టు

మొత్తం ఖాళీలు: 1,673

Work From Home Jobs For Women: పర్మినెంట్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు.. ఇంటినుంచే హ్యాపీగా పని చేసుకోవచ్చు

పోస్టుల వివ‌రాలు: 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉండగా.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు.

అర్హ‌త‌: పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌ వంటి పోస్టులకు లా డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

Good News for Unemployees : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. గురుకులాల్లో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఎంపిక విధానం: ఏప్రిల్‌లో రాత ప‌రీక్ష ఉంటుంది. ఆ త‌రువాత‌ స్కిల్స్ టెస్ట్, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. మరికొన్ని పోస్టులకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి.

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం.. చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 8, 2025 నుంచి 31 జ‌న‌వ‌రి, 2025 వ‌ర‌కు

అధికారిక వెబ్‌సైట్‌: https://tshc.gov.in/

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 04 Jan 2025 03:44PM

Photo Stories