Skip to main content

Job Mela: ఈనెల 19వ తేదీ జాబ్‌మేళా.. అర్హులు వీరే..

Job mela in Vijayawada on 19th October  employment opportunities in Vijayawada  for unemployed youth

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 19వ తేదీ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు అక్టోబ‌ర్ 15వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ జాబ్‌మేళాకు.. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమోతో పాటుగా బీఎస్సీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన 19 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు అర్హులు. 

ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఈ నెల 19వ తేదీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరు కావచ్చు. ఇతర వివరాలకు 70959 91979, 63050 04318 నంబర్లను సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 16 Oct 2024 05:40PM

Photo Stories