Good News : నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఖాళీలు.. వివరాలివే..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 28 నవోదయ, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా 6,700 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రం అంచనా.
ఇందులో కేవీల్లో 5,388 ఖాళీలు, నవోదయాల్లో 1,316 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. రూ.5,872 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల కాలంలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఏపీలో 8 కేవీఎస్‌లు
దేశంలో ప్రస్తుతం 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, ఏపీలో కొత్తగా మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి, వలసపల్లి , పాల సముద్రం, తాళ్లపల్లి నందిగామ, రొంపిచర్ల, నూజివీడు, డోన్‌లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
ఏడు కొత్త నవోదయలు
దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Tags
- NVS and KVS Notificaiton
- Job Notification
- Jobs 2024
- Teaching Posts
- teaching recruitments
- navodaya vidhyalaya
- Kendriya Vidyalaya
- AP government
- new navodaya vidhyalayas
- Union Cabinet
- NVS and KVS Recruitments
- job recruitments in ap and tg
- central government
- kendriya vidyalaya recruitments
- navodaya vidyalaya recruitments
- job recruitments in ap and ts
- ap and ts job notifications
- Education News
- Sakshi Education News
- employment opportunities
- Job opportunities in education
- New schools in India
- Educational growth