15000 Jobs: మెగా జాబ్‌మేళా.. 50 కంపెనీలు.. పూర్తి వివరాలివే!
శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఈజీఎంఎం అధికారులతో జాబ్ మేళా నిర్వహించే గార్డెన్‌ను అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజీఎంఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మండలంలోని చల్వాయి శివారులోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్ డియోఘర్‌లో 107 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి సీతక్క ప్రారంభిస్తారని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువతీయువకులు మేళాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఆయా కంపెనీలు శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 15,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. డీపీఎం సతీశ్, ఎంపీఓ శరత్ కుమార్, చల్వాయి కార్యదర్శి భారతి, ఏటీఎం నాగేశ్వరరావు, సీసీలు రజియా, సుభాషిని, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- Mega Job Mela
- Unemployed Youth
- Sampath Rao
- Seethakka
- 15000 Jobs
- Mulugu District News
- PSR Gardens
- job mela in telangana
- Job Mela in TG
- Mega Job Mela 2025
- Mega Job Mela 2025 for Freshers
- Jobs 2025
- RuralEmployment
- JobFair2025
- YouthJobOpportunities
- EGMMJobFair
- GovindaraopetJobFair
- MegaJobFair
- UnemployedYouth