Skip to main content

Tomorrow Holiday news: రేపు విద్యా సంస్థలు బంద్‌ ఎందుకంటే..

Tomorrow Holiday news   against NEET NET paper leakage   Students gathering for nationwide bandh
Tomorrow Holiday news

తిరుపతి కల్చరల్‌: నీట్‌ నెట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన నిర్వహించే దేశ వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌, ఎన్‌ఎస్‌యూఐ నేత మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి పిలుపు నిచ్చారు.

Anganwadi news: అంగన్‌వాడీ టీచర్లకు, వర్కర్లలకు Bad News...

ఈమేరకు యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నీట్‌ ప్రవేశ పరీక్షలో దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది అవకతవకలు జరిగాయన్నారు. ఈ నీట్‌ పరీక్ష నిర్వహించే ఎన్‌టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పంద లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్‌ పరీక్ష పత్రాల లీకులకు కారణమైన నేషనల్‌ టెస్టింగ్‌ల ఏజెన్సీని రద్దు చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు 4వ తేదీన జరిగే బంద్‌లో విద్యార్థి సంఘాలను కలుపుకొని ఎల్‌కేజీ నుంచి పీజీ విద్యార్థుల వరకు బంద్‌ చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, నాయకులు హరికృష్ణ, వినోద్‌, తేజ, బాల, ఉమేష్‌, శివ పాల్గొన్నారు.

Published date : 03 Jul 2024 03:13PM

Photo Stories