Skip to main content

Five Government Jobs Women Success Story : ప‌రీక్ష రాస్తే... ప్ర‌భుత్వ ఉద్యోగ‌మే... వ‌రుస‌గా 5 జాబ్స్ కొట్టానిలా.. కానీ...!

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ఒక్క ప్ర‌భుత్వ‌ ఉద్యోగం చాలు.. లైఫ్ సెట్ అయిన‌ట్టే అనుకుంటుంటారు కొన్ని ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు. అయితే.. తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన మాత్రం ఒక‌టి కాదు... రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఔరా అనేనా చేసింది.
Sankeerthana

ఈ నేప‌థ్యంలో సంకీర్తన ఈ ఐదు ఉద్యోగాల‌ను ఎలా సాధించింది..? కుటుంబ నేప‌థ్యం ఏమిటి...? ఇలా మొద‌లైన అంశాల గురించి... ప్ర‌త్యేక స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
సంకీర్తన.. తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వారు. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్‌, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ... తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. 

ఎడ్యుకేష‌న్ : 
సంకీర్తన.. పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చ‌దివారు. డిగ్రీ కోఠి ఉమెన్స్‌ కళాశాలలో చదివారు. 

వ‌రుస‌గా ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా...
సంకీర్తన... 2023లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్‌–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్‌ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే.. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) గ్రేడ్‌–1లో రెండు ఉద్యోగాలు సాధించింది.

➤☛ TS Government Jobs New Notifications 2025 : ఇక‌పై వ‌రుసగా ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇలా...

రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు..
సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్‌ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) గ్రేడ్‌ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను మార్చి 19వ తేదీన (బుధవారం) ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్‌లో 1వ ర్యాంకు సాధించింది. సంకీర్తన చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే సంకీర్తనకు ల‌క్ష్యంపై ఉన్న క‌సి, ప‌ట్టుద‌ల ఎంతో మంది నేటి యువ‌త‌కు స్ఫూర్తినిస్తుంది.

Published date : 21 Mar 2025 03:03PM

Photo Stories