Skip to main content

Group 1 Ranker Success Story : సీడీపీఓ, గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా... నా స్టోరీ ఇదే..!

చాలా మంది సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం ఉంటుంది. వీరి ప్ర‌యాణంలో సమాజ‌ సేవకు ఒక్కొక్క‌రు ఒక దారి ఎంపిక చేసుకుంటారు. ఒక‌రు ఐఏఎస్ అయి సేవ చేయాల‌నో.. ఇంకొక్క‌రు ఐపీఎస్ అయి సేవ చేయ‌ల‌నో.. లేదా ఎదో ఒక్క ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించి... ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉంటారు.
DSP Sindhu Priya Success Story

స‌రిగ్గా ఇలాగే డీఎస్పీ సింధుప్రియకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ గల జీవన విధానాన్ని తల్లిదండ్రులు నేర్పారు. సమాజంపై అవగాహన పెంపొందించి.. తమ వంతు సేవ చేయాలని నిత్యం చెప్పేవారు. ఇదే త‌న‌లో స్ఫూర్తిని కలిగించి గ్రూప్స్‌ రాసేలా ప్రేరేపించింది. వివాహమయ్యాక భర్త ప్రోత్సహించారు. అనుకున్న డీఎస్సీ ఉద్యోగం సాధించి.. త‌న వంతు సమాజానికి సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో డీఎస్పీ సింధుప్రియ స‌క్సెస్ స్టోరీ మీకోసం... 

కుటుంబ నేపథ్యం..
మాది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లి. తండ్రి లింగారెడ్డి, తల్లి వనజాక్షి, సోదరుడు నందకుమార్‌రెడ్డి. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సోదరుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భర్త కల్యాణ్‌ చక్రవర్తి హైకోర్టు న్యాయవాది.

➤☛ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

విద్యాభ్యాసం..
మా చదువుల నిమిత్తం మా కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్టయింది. అక్కడే నా విద్యాభ్యాసమంతా సాగింది. మౌలాలీలోని మదర్‌ థెరీసా హైస్కూల్లో పదో తరగతి. నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌. ఎమ్వీఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ అభ్యసించా. మాస్టర్స్‌ ఇన్‌ సోషియాలజీ చేశా.

➤☛ Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

గ్రూప్స్ వైపుకు ఇలా..
చిన్నతనం నుంచే క్రమశిక్షణ గల జీవన విధానాన్ని తల్లిదండ్రులు నేర్పారు. సమాజంపై అవగాహన పెంపొందించి.. తమ వంతు సేవ చేయాలని నిత్యం చెప్పేవారు. ఇదే నాలో స్ఫూర్తిని కలిగించి గ్రూప్స్‌ రాసేలా ప్రేరేపించింది. వివాహమయ్యాక భర్త ప్రోత్సహించారు.

➤☛ Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

సీడీపీఓ ఉద్యోగం చేస్తూనే..
గ్రూప్స్‌నకు సన్నద్ధమవుతున్న సమయంలోనే సీడీపీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2018 సెప్టెంబర్‌లో సూర్యాపేటలో సీడీపీఓగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించా. అనంతరం మహిళా కమిషన్‌లో పనిచేశా. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశా. ఉద్యోగమొచ్చిందని నా లక్ష్యాన్ని మర్చిపోలేదు.

➤☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

నా తొలి పోస్టింగ్ ఎక్క‌డంటే...?

DSP Sindhu Success Story

ప్రొబేషనరీ డీఎస్పీగా తిరుపతి జిల్లాలో పనిచేశా. నెల్లూరు డీఎస్పీగా బాధ్యతలను  2025 జ‌న‌వ‌రి 20న స్వీకరించా. నా తొలి పోస్టింగ్‌ ఇది. ఎంతో ఆనందంగా ఉంది.

➤☛ Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

నా తొలి ప్రాధాన్యం..
మహిళలు, చిన్నారుల భద్రతకు తొలి ప్రాధాన్యం. వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపడతా. ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకొని అందరి సమన్వయంతో నగర వాసులకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తా. సైబర్‌ నేరాలు, మత్తు, మాదకద్రవ్యాల వినియోగంతో సంభవించే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. విధి నిర్వహణలో రాజీపడే ప్రసక్తేలేదు.

➤☛ Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

పోలీస్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తా. 24 గంటలూ అందుబాటులో ఉంటా. ఎలాంటి సమస్యలున్నా నేరుగా నన్ను కలవొచ్చు. నేరుగా రాలేని వారు 94407 96303 నంబర్‌ను సంప్రదించొచ్చు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలి.

➤☛ IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

➤☛ Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Published date : 24 Jan 2025 12:29PM

Photo Stories