Skip to main content

Constable Jobs Success Stories : కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. విచిత్రాలేన్నో.. ఒకే కుటుంబం నుంచి.. ఇద్ద‌రు.. ముగ్గురు.. ఇలా..

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు (టీఎస్‌ఎల్పీఆర్‌బీ) అక్టోబ‌ర్ 4వ తేదీన విడుద‌ల చేసిన కానిస్టేబుల్‌ తుది ఫ‌లితాల్లో చాలా కుటుంబాల్లో ఇద్ద‌రు, ముగ్గురు చొప్పున చాలా చోట్ల విచిత్రంగా ఉద్యోగాలు సాధించారు.
Families Celebrating Multiple Job Successes,TSLPRB Constable Final Results Released,Constable Jobs Success Stories in telangana,Success in TSLPRB Constable Recruitment
TS Constable Jobs Success Stories

ఈ కుటుంబాల్లో పోలీసు ఉద్యోగాల పంట పండింది. కొన్ని గ్రామాల్లోని మూడు కుటుంబంలకు చెందిన ముగ్గురేసి అన్నదమ్ములు కానిస్టేబుల్‌ కొలువులు సాధించి అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

కుమురంభీం జిల్లాల్లో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన వెన్నంపల్లి శివలింగం-శంకరమ్మ దంపతుల ముగ్గురు కుమారులు ఉపేందర్‌ (సివిల్‌), మహేందర్‌ (సివిల్‌), విజయ్‌ (టీఎస్‌ఎస్‌పీ)లు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 

☛ Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

అలాగే పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయికి చెందిన మాధవ్‌-సునీత దంపతుల కుమారులు వెంకటేశ్‌ (టీఎస్‌ఎస్పీ), కవలలైన రామ్‌ (ఏఆర్‌), లక్ష్మణ్‌ (టీఎస్‌ఎస్పీ)లు కానిస్టేబుల్‌ పరీక్షల్లో సత్తా చాటారు.

వీరితో పాటు కౌటాల మండలం వీర్దండికి చెందిన అన్నదమ్ములు ఈర్ల వంశీకృష్ణ (టీఎస్‌ఎస్పీ), శివకృష్ణ (సివిల్‌), సాయికృష్ణ (ఏఆర్‌) పోలీస్ కొలువుకి ఎంపికకావడంతో తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఈ విధంగా కుమురంభీం జిల్లాల్లో మూడు ఫ్యామిల్లీలో ముగ్గురేసి ఎంపికతో గ్రామ‌స్తులు, వీరి తల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ముగ్గురు కుమారులు..

ts police jobs success story in telugu

అలాగే ఈ ఫ‌లితాల్లో మెద‌క్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన సంగు శ్రావణ్, ప్రశాంత్ సందీప్ ఒకే కుటుంబం చెందిన ఈ ముగ్గురు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. సంగు దుర్గయ్య-సంగు లక్ష్మికి ముగ్గురు కుమారులు. తెలంగాణ కానిస్టేబుల్‌ పరీక్షల్లో ఈ ముగ్గురు కుమారులు అర్హత సాధించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంకు ఎంపిక‌య్యారు. సంగు శ్రావణ్ (టిఎస్ఎస్‌పీ) పీసి, సంగు ప్రశాంత్ (ఏఆర్) పీసీ, సంగు సందీప్ (టిఎస్ఎస్‌పీ) పీసీగా ఉద్యోగాలు సాధించారు. దీంతో వీరి తల్లిదండ్రులు సంతోషంతో మునిగిపోయారు. గ్రామ ప్రజలు కూడా ఆ ముగ్గురిని అభినందించారు. కష్టపడి చదివితే విజయం తప్పకుండా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఈ ముగ్గురు.

☛ Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వ‌హిస్తూనే ఎస్ఐగా ఎంపిక‌

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

ఒకే కుటుంబం చెందిన ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.. కూడా..

two sisters police constable success story

ఈ ఇంటిలో పోలీసు ఉద్యోగాల పంట పండింది. ఒకే కుటుంబం చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు విడుద‌ల చేసిన తుది ఫ‌లితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్‌. ఈయ‌న వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. త‌ల్లి అంజలి.  వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష. వీరు కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్‌ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. అలాగే వీరి మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

Published date : 06 Oct 2023 08:19AM

Photo Stories