Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..
పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లాకు చెందిన 330 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇది వరకే దేహదారుఢ్య పరీక్షలు, ప్రిలిమినరీలో అర్హత సాధించి తుది పరీక్షకు ఎంపికై పూర్తి చేశారు. ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 149 మంది, ఏఆర్ పోస్టుకు 84 మంది, తెలంగాణ స్పెషల్ పోలీసు (టీఎస్‌ఎస్‌పీ)కి 97 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందారు.
Success Achievement: ఉద్యోగానికి సెలవు.. ఎస్ఐగా ఎంపిక
కుటుంబీకులు, బంధువులు వారిని అభింనందించారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని డీఈవో కార్యాలయంలో సబార్డినెట్‌గా పనిచేస్తున్న రాథోడ్ కవిత కూతురు రాథోడ్ సింధు సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సింధు తండ్రి శివాజీ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి ఆశయాన్ని ఆమె కొనసాగిస్తోంది. అలాగే భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామానికి చెందిన అంకిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిని వారి వారి గ్రామస్తులు అభినందించి వారి హర్షాన్ని వ్యక్తం చేశారు.
Inspiring Success of Youth: నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన ఈ యువకులు
ఎంపికైన యువకులు..
కానిస్టేబుల్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాంసి గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్‌రెడ్డి, బట్టు రాహుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భీంపూర్, కరంజి(టి) గ్రామానికి చెందిన రవి ఏఆర్ కానిస్టేబుల్‌కి ఎంపిక కాగా, ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు అభినందించారు.
Young Woman Achieves SI Post: తొలి ప్రయత్నంలోనే ఎంపికైంది ఈ యువతి.. ఎలా?
కానిస్టేబుల్ ఉద్యోగాలకు పలువురి ఎంపిక..
కానిస్టేబుల్ ఫలితాల్లో మండలంలోని బాలాపూర్‌కు చెందిన వై. ప్రశాంత్, జి.బబ్లు, జి.వంశీ, మాకోడ గ్రామానికి చెందిన బి.అఖిల్, బెల్లూరికి చెందిన దశరథ్, ప్రణయ్, కూర గ్రామానికి చెందిన అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు.