Skip to main content

SI Manimala Sucess Story: ఇద్దరు పిల్లల తల్లి.. ఈవెంట్స్‌ కోసం కష్టనష్టాలకోర్చి విజయం సాధించారు

ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో ΄పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా ΄పాలనా చూసుకోవడం చాలా కష్టం.
SI Manimala Sucess Story in telugu

అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్‌  రావడంతో ఎలాగైనా ఆ జాబ్‌ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు.

ఈవెంట్స్‌ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్‌పేటలోని సీపీఎల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్‌ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు.

చదవండి: IAS Ramya Sucess Story: రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్‌ చేస్తే..!

శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో ΄పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.

Published date : 12 Sep 2024 05:18PM

Photo Stories