Woman SI Success Story : ఈ కసితోనే చదివి ఎస్‌ఐ ఉద్యోగం కొట్టానిలా.. కూలీకి వెళితేనే మాకు..
ఈ యువతి పేరు మనీషా. ఈ నేపథ్యంలో మనీషా సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మిడిదొడ్డి మనీషా.. తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన వారు. తల్లిదండ్రులు ఆండాలు, రాజయ్య. వీరు దినసరి కూలీలు. బాల్యం నుంచి చదువులో ముందుండేది మనీషా. మనీషా చిన్నప్పుడే ఉన్న ఊరు విడిచి కుటుంబం ఖమ్మంకు వలస వెళ్లారు.
ఎడ్యుకేషన్ :
మనీషా.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూల్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది. అలాగే ఇంటర్ వరంగల్‌లో చదివారు. డిగ్రీ కోఠి ఉమెన్స్ కాలేజ్‌లో పూర్తి చేసింది.
ఇప్పుడే అసలు సమస్య వచ్చింది..
అప్పుడే చదువు పూర్తి అయింది. ఆ సమయంలోనే కొవిడ్ రావడంతో అందరూ చదువు పూర్తైంది కదా పెళ్లి చేసుకో అనడంతో కచ్చితంగా చదువుకి సరిపడా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివింది. ఫలితంగా 245 మార్కులతో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించింది. ప్రతి ఇంట్లో అబ్బాయికి ఉన్న విలువ అమ్మాయికీ ఉండాలంటోంది మనీషా. అబ్బాయి చదువు పూర్తయ్యాక సెటిల్ అయ్యేందుకు చాలా సమయం ఇస్తారు. కానీ అమ్మాయిల విషయంలో ఎందుకీ పక్షపాత ధోరణి అంటోంది..? అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారంటోంది.
యువతకి నేనిచ్చే సలహా ఇదే..
మా తల్లిదండ్రుల కళ్లలో ఏం చుడాలి అనుకున్నానో ఇప్పుడు అది నేను చూస్తున్నాను. వాళ్లు దొరికిన పని చేసి మమ్మల్ని చదివించారు. అందరి తల్లిదండ్రుల్లా ఆలోచించకుండా నాపై నమ్మకం ఉంచి నన్ను చదివించారు. మనపై మనకి ముందుగా నమ్మకం ఉండాలి అప్పుడే ఎదుటివారు ఏం అన్నా అనుకున్నది సాధించగలం. ఇప్పటి యువతకి నేనిచ్చే సలహా ఏంటి అంటే మనం ఒక స్థాయిలో స్థిరపడ్డాకే పెళ్లి ఇలాంటివి ఆలోచించండి.
☛ Civil SI Achievement: ఎస్ఐగా కొలువు కొట్టిన సెక్యూరిటీ కూతురు..
కోచింగ్ తీసుకునే సమయంలో..
పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అందరూ ఒకేలా చదవలేరని అంటోంది మనీషా. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని చెబుతోంది. తన విషయంలో ఏ రోజు సిలబస్ ఆ రోజు పూర్తి చేశాకే నిద్రపోయేదాన్ని అంటోంది. కోచింగ్ తీసుకునే సమయంలో మిత్రులు చాలా ప్రోత్సాహం అందించారని చెబుతోంది.
హమాలీ, మేస్త్రీ పనులు చేసి..
ఆడపిల్లకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని కాక ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించాలని అంటున్నారు మనీషా తల్లిదండ్రులు. హమాలీ, మేస్త్రీ పనులు చేసి తన కుమార్తెను చదివించానని, ఇప్పుడిక కష్టాలన్నీ తీరపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
☛ Constable to SI Posts: మొన్నటివరకు కానిస్టేబుల్లు.. ఇప్పుడు ఎస్ఐగా విధులు