Elon Musk About College Education: ''జీవితంలో సక్సెస్ అయ్యేందుకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు.. ఆ టైం అంతా వృథా''
జీవితంలో సక్సెస్ అయ్యేందుకు డిగ్రీ అవసరం లేదు అని ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. కాలేజీ విద్యకు ప్రజల్లో అనవసర ప్రాధ్యాన్యం నెలకొందని, నిజానికి ప్రస్తుతం పట్టభధ్రుల కంటే వృత్తి నిపుణుల అవసరమే ఎక్కువ ఉందని పేర్కొన్నారు.
Open School Admissions: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
చాలామంది కాలేజీలో నాలుగేళ్ల పాటు సమయం వృథా చేస్తారు. చివరికి ఉపయోగపడే నైపుణ్యాలేవీ వారి వద్ద ఉండవు. సక్సెస్‌కు డిగ్రీలు అక్కర్లేదు అని మస్క్ అన్నారు. సంప్రదాయ విద్యావిధానంపై మస్క్ కామెంట్స్ ఇదే మొదటిది కాదు, గతంలోనూ టెస్లా కంపెనీలో పనిచేయడానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదంటూ 2019లో ఓ సందర్భంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
College is overrated https://t.co/JJMJAk3w7Y
— Elon Musk (@elonmusk) October 20, 2024
ఎలన్‌మస్క్ ఏం చదివాడంటే..?
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్‌మస్క్ ఏం చదివాడో తెలుసా? చిన్నప్పటి నుంచి కంప్యూటింగ్, వీడియో గేమ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపించే మస్క్ పదేళ్ల వయసులోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 12 ఏళ్లకే బ్లాస్టర్ అనే వీడియోగేమ్‌ను తయారు చేసి ఓ కంపెనీకి 500 డాలర్లకు అమ్మేశాడు. 1997లో ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేశాడు.
దీంతోపాటు ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. పీహెచ్‌డీ చేసేందుకు అమెరికా వెళ్లిన ఆయన చదువు పూర్తికాకుండానే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి వ్యాపారంపై ఉన్న మక్కువతో 28 ఏళ్లకే ఎక్స్ అనే కంపెనీని స్థాపించాడు.
30 ఏళ్లకే స్పేస్ ఎక్స్ అనే కంపెనీని నెలకొల్పాడు. ఇప్పుడు టెస్లా వరకు.. ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ అపరకుబేరుడిగా చలామణి అవుతున్నాడు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)