Billionaires: ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న కుబేరుల సంపద

వచ్చే దశాబ్ద కాలంలోనే కనీసం ఐదుగురు ట్రిలియనీర్లుగా (ట్రిలియన్ అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.86 లక్షల కోట్లు) అవతరించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ‘టేకర్స్, నాట్ మేకర్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో కొన్ని బిలియనీర్లు తమ సంపదను వారసత్వంగా లేదా ఇతర బాహ్య శక్తుల ద్వారా సంపాదించారని, స్వయంకృషితో సంపాదించిన వారు చాలా తక్కువగా ఉన్నారని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.
2024 నాటికి ప్రపంచ బిలియనీర్ల సంపద 2 ట్రిలియన్ డాలర్లను దాటింది, ఇది 2023తో పోలిస్తే మూడు రెట్లు వేగంగా పెరిగింది. ఈ సమయంలో ఎలాన్ మస్క్ 440 బిలియన్ డాలర్ల సంపదతో ప్రధాన కుబేరుడిగా ఉన్నాడు. జెఫ్ బెజోస్ ఆయన తరువాతి స్థానంలో ఉన్నాడు.
ఇలా సంపద పెరుగుతూ.. సమాజంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగిపోతున్నాయని ఆక్స్‌ఫామ్ తన నివేదికలో చెప్పింది. 1990 నుంచి ఇప్పటివరకు పేదరిక స్థితిగతులు మారలేదు. ఈ అసమానతలను తగ్గించడానికి బిలియనీర్లపై భారీగా పన్నులు విధించాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ పేర్కొంది.
Indian Economy: 2026 నాటికి 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్
అంతేకాకుండా.. ప్రపంచంలో జరుగుతున్న సంపద సృష్టిలో ఎక్కువ భాగం బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కైవసం చేసుకుంటున్నాయని, ఈ ఆధునిక వలసవాదం సమాజంలో మరింత అవస్థలను కలిగిస్తుందని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు.
రిపోర్ట్ హైలైట్స్..
- ప్రపంచంలో టాప్–10 అపర కుబేరుల సంపద 2024లో రోజుకు 10 కోట్ల డాలర్ల చొప్పున ఎగబాకింది. వారి సంపద రాత్రికిరాత్రి 99 శాతం ఆవిరైపోయినా కూడా బిలియనీర్లుగానే కొనసాగుతారు.
- ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంపద సగటున రోజుకు 570 కోట్ల డాలర్ల చొప్పున పెరిగింది.
- అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర గ్లోబల్ నార్త్ దేశాల్లోని 1% అపర కుబేరులకు గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థల నుంచి గంటకు 3 కోట్ల డాలర్ల సంపద బదిలీ అవుతోంది.
- ప్రపంచ జనాభాలో గ్లోబల్ నార్త్ దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ... ప్రపంచ సంపదలో 69 శాతం ఆ దేశాలదే!
RBI: ఆర్బీఐ కీలక ఆదేశాలు.. వ్యక్తిగత రుణాలకు స్థిర వడ్డీ రేటు
కొత్త కుబేరులు రయ్
2024లో మొత్తం కుబేరుల సంఖ్య 2,769కి ఎగబాకింది. 2023లో ఉన్న 2,565 మంది బిలియనీర్లతో పోలిస్తే కొత్తగా 204 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంటే సగటున వారానికి నలుగురు బిలియనీర్లు ఆవిర్భవించినట్లు లెక్క. ఇక ఆసియా నుంచి కొత్తగా 41 మంది కొత్త బిలియనీర్లు అవతరించారు. ఆసియా బిలియనీర్ల మొత్తం సంపద గతేడాది 299 బిలియన్ డాలర్లు దూసుకెళ్లింది.