Skip to main content

H 1B Visa : హెచ్ 1బి వీసాల‌పై అధ్యక్ష హోదాలో ట్రంప్ క్లారిటీ..

అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు.
America new president trump clarity on h 1b visa   Donald Trump immigration policy

సాక్షి ఎడ్యుకేష‌న్: అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. మంగళవారం (జనవరి 21) వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ ఈ విషయమై ఒరాకిల్‌, ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Human-Robot Marathon: ప్రపంచంలోనే తొలిసారి.. మనుషులతో కలిసి రోబోల పరుగు పందెం.. ఎక్కడంటే?

‘హెచ్‌1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్‌1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ఒరాకిల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్‌మస్క్‌ హెచ్‌1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్‌1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’ అని ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్‌1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి.

Gaza War: భీకర యుద్ధానికి తాత్కాలిక తెర.. ముగ్గురు బందీలను వదిలేసిన హమాస్

కొందరు హెచ్‌1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ మాత్రం హెచ్‌1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 22 Jan 2025 01:05PM

Photo Stories