Akash Bobba: మస్క్ ‘డోజ్’ బృందంలో భారత సంతతి కుర్రాడు ఆకాశ్ బొబ్బ

మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) బృందంలోకి మరో భారతీయుడు చేరాడు. డోజ్‌కు ఎంపిక చేసిన ఆరుగురు యువ ఇంజనీర్ల బృందంలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ ఉన్నారు. 22 ఏళ్ల ఆకాశ్ బొబ్బ బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, ఎంటర్‌పెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు.
మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేశారు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లోనూ కొంత కాలం పనిచేసిన ఆకాశ్.. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్వ్యవస్థీకరణ తదితరాలను డోజ్ పర్యవేక్షించనుంది.
డోజ్‌లోకి తొలుత భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిని ట్రంప్ ఎంపిక చేశారు. ఒహాయో గవర్నర్ పోటీ చేయడం కోసం వివేక్ రామస్వామి డోజ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఒక్కరి నేతృత్వంలోనే ఉన్న డోజ్‌లోకి కొత్తగా ఈ ఆరుగురు యువ ఇంజనీర్లను తీసుకున్నారు.
Shubhanshu Shukla: డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పైలట్‌గా శుభాంశు శుక్లా