Skip to main content

Constable to SI Posts: మొన్న‌టివ‌ర‌కు కానిస్టేబుల్లు.. ఇప్పుడు ఎస్ఐగా విధులు

చ‌దువుకుంటూనే చాలామంది విద్యార్థులు విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. అటువంటిది ఒక ఉద్యోగం చేస్తూనే అదే శాఖ‌లో మ‌రో స్థాయికి ఎదిగారు. కానిస్టేబుల్ గా విధుల‌ను నిర్వ‌హిస్తూనే ఎస్ఐలుగా ఎంపికైన వీరికి స‌న్మానం జ‌రిపారు..
SP felicitates Constables who achieved SI posts
SP felicitates Constables who achieved SI posts

టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ విడుదల చేసిన ఎస్‌ఐ తుది ఫలితాల్లో జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కానిస్టేబుల్స్‌ సత్తా చాటారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌ఐలుగా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు.

   Dream Success Journey: చిన్న‌త‌నంలో ఎంచుకున్న ల‌క్ష్యాన్ని సాధించిన యువ‌కుడు..

ప్రజా సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ విధులు, కర్తవ్యాల్లో జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎస్‌ఐలుగా ఎంపికైన కానిస్టేబుల్స్‌ ఉమాదేవి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి , శ్రీశైలం, శశిధర్‌, సుజిత్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

➤   Civil SI Achievement: ఎస్ఐగా కొలువు కొట్టిన సెక్యూరిటీ కూతురు..

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఓ జ్యోతిర్మని, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ డీవీపీ రాజు, పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమీల, ఆర్‌ఐ సూర్య నాయుడు, జిల్లా పోలీస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 22 Oct 2023 05:51PM

Photo Stories