Dream Success Journey: చిన్నతనంలో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన యువకుడు..
లక్ష్యం, పట్టుదల, కృషి ఉన్న వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే.. విజయం మన ముగింటకు వస్తుంది. అలా జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్ని.. తమ లక్ష్యం వైపు అడుగులు వేసి.. చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యంపై గురి ఉన్నవారికి పేదరికం, ఆర్థిక సమస్యలు వంటి వాటికి భయపడకండా శ్రమించి విజయం సాధిస్తారు. అలా ఎందరో కష్టాలను ఎదుర్కొని జీవితంలో విజేతలుగా నిలిచారు. తాజాగా వారి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బొంత ప్రవీణ్ చేరాడు. ఒకప్పుడు కూలీగా ఉన్న ఆ యువకుడు నేడు.. ఎస్సైగా నిలిచాడు.
ఉమ్మడి నల్లగొండ గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన పూర్తి ..బొంత పాపయ్య, ఆండాళ్లు దంపతులు. వీరికి బొంత ప్రవీణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి చిన్నతనం నుంచి పోలీస్ అవ్వాలనే కల ఉండేది. ఈ క్రమంలోనే ప్రాథమిక, ఉన్నత విద్యలో బాగా రాణించాడు. ఇలానే ఇంజినీరింగ్ లో చేరి.. కష్టపడ్డాడు 2021 సంవత్సరంలో పూర్తి చేశాడు.. అనంతరం, తాను మెచ్చిన కానిస్టేబుల్, ఎస్సై పోస్టుకు సంబంధిత పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తన పరీక్షలకే కాకుండా, తన కుటుంబం కోసం కూడా రోజూ కూలీ పనికి వెళ్ళి ఆర్థికంగా సహాయపడేవాడు. కూలీ పనులు చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేవాడు.
➤ Youth Success as SI: మొట్టమొదటి ప్రయత్నంలోనే గెలుపొందిన యువతీయువకులు
ఈ ప్రయాణంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై పరీక్షలను పూర్తి చేశాడు. ఈ పరీక్షల ఫలితాల అనుసారం, ప్రవీణ్ ఎస్పీఎఫ్ ఎస్సైగా ఎంపికయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఎస్సై ఫలితాలు విడుదలతో ఈ విషయం అందింది. ఎస్సై ఫలితాలు వచ్చే రోజు కూడా ప్రవీణ్ తన తండ్రితో కలిసి గుండాల మండల కేంద్రంలో కూలీ పనులు చేశాడు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదిగేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రవీణ్ ఎస్సైగా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎస్సై ఉద్యోగానికి ప్రవీణ్ మేనత్త కొడుకు ఆలకుంట్ల నరేష్ కూడా ఎంపికయ్యాడు.