Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
ఈ ఫలితాల్లో ఎంతో మంది పేదింటి బిడ్దలు తమ సత్తాచాటి ఎస్సై ఉద్యోగం సాధించారు. అలాగే చాలా మంది పెళైన మహిళలు కూడా తాము కూడా ఏమి తక్కువకాదు అని.. ఈ ఎస్ఐ ఉద్యోగం కొట్టి తమ సత్త ఏమిటో చూపించారు. సరిగ్గా ఇదే కోవకు చెందిన.. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామంకు చెందిన కొండపల్లి ప్రమీలాదేవి 16వ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన ప్రమీలాదేవి సక్సెస్ జర్నీ మీకోసం..
☛ Teacher as SI: ఎస్ఐగా విజయం పొందిన ఉపాధ్యాయురాలు
కుటుంబ నేపథ్యం :
ఏపీ ఎస్సై మెయిన్ పరీక్షల్లో అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామంకు చెందిన కొండపల్లి ప్రమీలాదేవి ఓపెన్ కేటగిరిలో 16వ ర్యాంక్ సాధించారు. గృహిణిగానే కాకుండా ఇద్దరు పిల్లల తల్లిగా నిత్యం పనులతో హడివుడిగా ఉండే ఆమె ఈ ఘనత సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
☛ IFS Officer Success Story : ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదని IFS ఉద్యోగం ఎంచుకున్నా..
సచివాలయలో ఉద్యోగం వచ్చిన కూడా..
గతంలో ఆమెకు సచివాలయ పోలీస్ ఉద్యోగం వచ్చిన విధుల్లో చేరకుండా ఎస్సై అవ్వాలన్న ధృడ సంకల్పంతో చదివారు. తాను అనుకున్నట్లే ఇటీవల జరిగిన మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఓపెన్ కేటగిరిలో 16వ ర్యాంక్, మహిళా విభాగంలో 5వ ర్యాంక్ సాధించారు. భర్త సత్తిబాబు ప్రోత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగానని ఆమె సాక్షితో మాట్లాడుతూ చెప్పారు.
☛ ఏపీ ఎస్‌ఐ ఫైనల్ ఫలితాలు 2023 విడుదల కోసం క్లిక్ చేయండి
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్, రిజర్వ్ విభాగాల్లోని 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎట్టకేలకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ డిసెంబర్ 6వ తేదీన(బుధవారం) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభించనున్నారు.
APPSC Group 1 Rankers Success Stories : ఒకే ఇంట్లో అన్నదమ్ములకు గ్రూప్-1 ఉద్యోగాలు.. కొట్టారిలా..
Tags
- women si success story
- women si success story in telugu
- ap si rankers success stories in telugu
- ap si job success stories in telugu
- ap si jobs selected candidates success stories
- ap si jobs selected candidates success stories in telugu
- Competitive Exams Success Stories
- SI Jobs
- ap si jobs selected success stories
- ap police success story in telugu
- ap si success stories
- women si sucess story in telugu
- ap women si success story in telugu
- ap si qualified candidates stories in telugu
- SuccessJourney
- SIJobAchievement
- sakshi education success story
- inspirational story