IFS Officer Success Story : ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదని IFS ఉద్యోగం ఎంచుకున్నా..
ఇలాంటి కీలకమైన పరీక్షల్లో జాతీయ స్థాయిలో 9వ ర్యాంక్ సాదించి.. ఐఏఎస్ కొట్టిన ఓ యువతి.. ఈ ఐఏఎస్ ఉద్యోగం కాదనీ.. ఐఎఫ్ఎస్(IFS) ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఈమే అపాలా మిశ్రా. ఈమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది.. ఈమె లక్ష్యం ఏమిటి.. ? ఈమె సివిల్స్‌కు ఎందుకు ప్రిపేర్ అయ్యారు..? ఈ నేపథ్యంలో అపాలా మిశ్రా సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
అపాలా మిశ్రా స్వస్థలం..ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా. ఆమె తండ్రి ఆర్మీలో కల్నల్ పనిచేస్తున్నారు. అలాగే ఈమె తల్లి యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఎడ్యుకేషన్ :
అపాలా మిశ్రా.. BDS పూర్తి చేసి డాక్టర్ పనిచేశారు. డాక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే.. యూపీఎస్సీ సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు.
IAS వచ్చినా కాదని.. IFS వైపు రావడానికి కారణం ఇదే..
అపాలా మిశ్రా.. డాక్టర్‌గా పనిచేస్తునే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్ష ప్రిపరేషన్ కొనసాగించారు. ఈమె తన మొదటి రెండు ప్రయత్నాలలో సివిల్స్‌లో విజయం సాధించలేదు. ఈమె ఇంకా తన ప్రిపరేషన్ స్థాయిని పెంచి.. మూడవ ప్రయత్నంలో(2020) జాతీయ స్థాయిలో 9వ ర్యాంక్ సాధించారు. అంతే కాదు, ఆ సంవత్సరం ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థి ఈమే. తన ఇంటర్వ్యూలో 275 మార్కులకు 215 మార్కులు వచ్చాయి. కానీ ఈమె IASకి బదులుగా ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) ఎంచుకుంది.
తన నిర్ణయం వెనుక ఉన్న కారణం గురించి ఈమె మాట్లాడుతూ.. UPSC క్లియర్ అయిన తర్వాత.., రాబోయే 30 సంవత్సరాల పాటు అదే పనిని చేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీకు నచ్చిన పని చేయడం చాలా ముఖ్యం. ఆ పని పట్ల మీకు మక్కువ ఉండాలి అని తెలిపింది. తనకు అంతర్జాతీయ సంబంధాలపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉందనీ.., ఈ సబ్జెక్టును చదవడం తనకు చాలా ఇష్టమనీ, అందుకే ఈ ఆసక్తిని దేశానికి సేవ చేయడంలో ఉపయోగించుకోవచ్చని భావించానని, అందుకే IFS పోస్టును ఎంచుకున్నానని తన మనస్సులోని మాటను తెలిపారు ఈమె.
నా కెరీర్‌లో అన్ని సాహసోపేత నిర్ణయాలే..
నా నిర్ణయం నాకు అంత సులువు కాదనీ, మొదట్లో తనకు చాలా అయోమయంగా ఉండేదని అపాల తెలిపింది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపరేషన్ సమయంలోనే IFS గురించి మరింత తెలుసుకున్నప్పుడు, దానిపై ఆసక్తి పెరిగిందని అపాల చెప్పింది. ఇలా ఆమె కెరీర్‌లో అన్నీ సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటూ.. వాటిలో విజయం సాధిస్తూ.. దేశ యువతకు ప్రేరణగా నిలుస్తోంది ఈ మహిళ సివిల్స్ టాపర్ అపాలా మిశ్రా.
☛ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Tags
- UPSC Civils Ranker Success Story
- IFS Apala Mishra
- upsc ranker success story in telugu
- Apala Mishra IFS Success Story
- IFS
- indian foreign service officer salary
- Indian Foreign Service
- Success Story
- Inspire
- Motivation
- Inspire 2023
- Competitive Exams Success Stories
- UPSC
- Failure to Success Story
- upsc civils ranker success story in telugu
- upsc civils ranker success story telugu
- Sakshi Education Success Stories