Anudeep Durishetty: అనుదీప్.. హైదరాబాద్ కలెక్టర్.. కలెక్టర్‌గా పని చేసినవారిలో అత్యంత పిన్న వయస్కుడు.. సక్సెస్ జర్నీ మీకోసం..
ఏకంగా ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. శిక్షణ అనంతరం భద్రాది కొత్తగూడెం ట్రైనీ కలెక్టర్‌గా, అడిషనల్ కలెక్టర్‌గా పని చేశారు. 2021లో అదే జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డుకు కృషి చేశారు. 2023 జూన్‌లో హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జిల్లా కలెక్టర్‌గా పని చేసినవారిలో అనుదీపే అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే.. ఒక యుద్ధం లాంటిది. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే. ఇలాంటి యుద్ధంలో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ సివిల్స్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లా కలెక్టర్ పనిచేసి.. ఇప్పుడ ఏకంగా హైదరాబాద్ జిల్లాకే కలెక్టర్ బదిలీ అయ్యాడు.
యువతకు ఈ యువ కలెక్టర్ నేడు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో దురిశెట్టి అనుదీప్ ఐఏఎస్ సక్సెస్ జర్నీ మీకోసం..
ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు..
అందరి సహకారంతో భద్రాద్రి(కొత్తగూడెం)జిల్లాను అభివృద్ధి వైపు పయనింపజేయగలిగామని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులతో ఇక్కడి నుంచి వెళుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో తనకు శిక్షణా కలెక్టర్‌గా జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారని, భద్రాద్రి కొత్తగూడెం అంటే చాలా దూరమని మొదట అనుకున్నానని, కానీ జిల్లా ఇంతగా ఆదరిస్తుందని అనుకోలేదని అన్నారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో..
తనకంటే ముందు కలెక్టర్లు రజత్‌కుమార్ శైనీ, ఎంవీ రెడ్డి వద్ద పనిచేయడంతో ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అదనపు కలెక్టర్ సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పారు. పోడు సమస్య పరిష్కారంలో ఐటీడీఏ పీఓ, డీఎఫ్‌ఓల సహకారం మరువలేనిదన్నారు. ఎస్పీలు సునీల్‌దత్, వినీత్ కూడా ఎంతగానో సహకరించారని, విధుల నిర్వహణలో సిబ్బంది సైతం అద్భుతంగా పనిచేశారని అభినందించారు. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారని అన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
నా భార్య సహాకారం కూడా..
తన బాధ్యతల్లో సతీమణి సైతం ఓ స్నేహితురాలిగా సహకారం అందించారని, తన కుమారుడు మన్యం బిడ్డేనని చెప్పారు. తల్లిదండ్రులు నేర్పిన సిద్ధాంతాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భద్రాద్రి రాముడితో పాటు పరిపాలనా ఓనమాలు నేర్పిన జిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.
అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ.. జాతీయ ర్యాంకర్‌గా ఖ్యాతిని ఆర్జించడమే కాదు.. మొదటి సారి సొంత రాష్ట్రంలో, అదీ ఆదివాసీ జిల్లా అయిన భద్రాద్రిలో మొదటి పోస్టింగ్ సాధించిన అనుదీప్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తారని అన్నారు.ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా వెళుతున్నారని, ముందు ముందు దేశ రాజధాని ఢిల్లీలో కూడా సత్తా చాటడం ఖాయమని చెప్పారు.
నా లక్ష్యం..
2013లో విజయంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్‌ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐఏఎస్ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్‌కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్‌ఎస్ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్‌తో అధిక శాతం రీడింగ్‌పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయాను.
వరుసగా రెండుసార్లు ఓటమి..
వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయింది. దీంతో 2016లో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్’ దూరం కాలేదు.
‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్‌స్టాప్ పెట్టాను. 2017 నోటిఫికేషన్‌లో అటెంప్ట్ ఇచ్చాను.
వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్-1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.
Tags
- anudeep durishetty ias
- anudeep durishetty ias success story
- anudeep durishetty ias details
- anudeep durishetty posting
- anudeep durishetty rank
- anudeep durishetty motivation story
- Ias Officer Success Story
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- IAS Success Story
- Telangana News