Contract ANMs: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల నిరసన.. పరీక్ష లేకుండా.. ఇలా చేయాలి..
Sakshi Education
కైలాస్‌నగర్: రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 20న కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు 48 గంటల నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘ బాధ్యుడు నవీన్ మాట్లాడుతూ.. గతంలో సమ్మె చేయగా గత సెప్టెంబర్ 2న ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసిందని, కమిటీ నివేది క ఇవ్వకముందే ప్రభుత్వం మళ్లీ రాత పరీక్ష పెడుతోందని తెలిపారు.
చదవండి: Fees Reimbursement : ఫీజు విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
రాత పరీక్షను తక్షణమే రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సర్వీస్ వెయిటేజీ కింద 50 మార్కులు ఇవ్వాలని, వయోపరిమితి నిబంధన ఎత్తివేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జనాభా ప్రాతి పదికన సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, నాయకులు లింగాల చిన్నన్న, ఏఎన్‌ఎంలు పుష్పల, ఆనందబాయ్, పద్మ, తులసి, లలిత, మనీలత, ప్రియదర్శిని, అనురాధ, అహల్య, లక్ష్మి, కరుణ తదితరులు పాల్గొన్నారు.
Published date : 21 Dec 2024 03:36PM