Anganwadi Centers: అంగన్‌వాడీ కేంద్రాలను సక్రమంగా పర్యవేక్షించాలి.. ఈ పిల్లలను గుర్తించాలి..
డిసెంబర్ 20న కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆట, పాటలతో కూడిన విద్య, పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. అంగన్‌వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలలలో మండలం వారీగా సెక్టర్లలో పని చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి: Free Training: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం
కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించడంలో అలసత్వం వహించడంపై సీడీపీఓలను, సూపర్‌వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు. బరువు తక్కువ ఉన్న ఐదేళ్లు లోపు పిల్లలను గుర్తించి ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కు పంపించాలని, సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లోకేషన్‌తో వచ్చే ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. గర్భిణుల ఇంటికి వెళ్లి వారి గురించి అడిగి తెలుసుకోవాలని. యాప్‌లో ఎప్పటికప్పుడు డేటా అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మహిళా,శిశు, సంక్షేమ శాఖ అధికారిణి జరీనాబేగం, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.