Skip to main content

DSP Karunakar: గిరిజనులకు చదువే ఆయుధం

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గిరిజన ప్రజలకు చదువే ఆయుధం వంటిదని డీఎస్పీ కరుణాకర్‌ అన్నారు.
Education is the weapon of tribals

రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడలో డిసెంబ‌ర్ 20న‌ రాత్రి మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మోడల్‌ స్కూల్స్‌, గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక విద్యార్థులతో భర్తీ కాని సీట్లను పక్క జిల్లాల విద్యార్థులతో భర్తీ చేస్తున్నారన్నారు.

చదవండి: Dummy Students: 29 స్కూళ్లలో డమ్మీ విద్యార్థులు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి

ఆదివాసీ, గిరిజన ప్రజల అభివృద్ధి చదువుతోనే సాధ్యమని పేర్కొన్నారు. అలాగే సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల కాల్స్‌, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. సైబర్‌ మోసాల బారినపడితే 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలోనూ అశ్రయం కల్పించవద్దని కోరారు. మద్యం, ఇతర వ్యసనాలకు యువత దూరంగా ఉండాలన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమస్యలుంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ బుద్దె స్వామి, రెబ్బెన ఎస్సై డి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 21 Dec 2024 03:05PM

Photo Stories