Skip to main content

Navodaya Admissions: నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపు

రాయదుర్గం: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాల దరఖాస్తు తేదీని పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్‌ రీజియన్‌ డిప్యూటీ కమిషనర్‌ టి.గోపాలకృష్ణ వెల్లడించారు.
Extension of deadline for Navodaya admissions  T. Gopalakrishna announcing admission extension for Navodaya Vidyalayas Extended application dates for Navodaya Vidyalaya admissions

ఆయన న‌వంబ‌ర్‌ 6న ‘సాక్షి’తో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

న‌వంబ‌ర్‌ 9 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. ఇందుకు ప్రవేశ పరీక్షను 2025 ఫిబ్రవరి 8న నిర్వహిస్తామన్నారు.

చదవండి: JEE Advanced 2025: ఈ సంవత్సరం తర్వాత పుట్టినవారికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. అర్హత నిబంధనలు విడుదల చేసిన ఐఐటీ కాన్పూర్‌ ..

9వ తరగతిలో ప్రవేశానికి 2010 మే 1 నుంచి 2012 జూలై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు.. ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ 2008 జూన్‌ 1 నుంచి 2010 జూలై 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.   

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Nov 2024 12:20PM

Photo Stories