Skip to main content

Display Teachers Photos: గురువులను గుర్తుపట్టేలా.. వివరాలతో ఫ్లెక్సీలు..

లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది.
Schools directed to display photos of teachers

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నేడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలతోపాటు వారి ఫొటోలను కూడా ఆయా పాఠశాలను ప్రదర్శించాలని ఇటీవలనే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలతోపాటు వారి ఫొటోలను ప్రదర్శించనున్నారు.

గ్రామస్తులు గుర్తుపట్టేలా...

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్‌ కళాశాలల్లో, కేజీబీవీలతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లిన సందర్భంగా, గ్రామస్తులు పాఠశాలలను సందర్శించిన సమయంలో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తుపట్టేలా ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

చదవండి: School Timings Change: పాఠశాలల పనివేళలు మార్చాలి.. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు

చాలా మంది ఉపాధ్యాయులు అనేక రోజుల వరకు పాఠశాలలకు వెళ్లకుండా సమావేశాల పేరిట పాఠశాలలకు వెళ్లకుండా డుమ్మా కొడుతున్నారని, అలాగే కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా విద్యావంతులను వీవీలుగా నియమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటివాటికి చెక్‌ పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలుస్తోంది. పాఠశాలలకు గ్రామస్తులు వచ్చిన సందర్భంలో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ సమస్య కూడా పరిష్కరించేలా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలతోపాటు వారి ఫొటోలు ప్రదర్శించనున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఫొటోల సేకరణలో...

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలను సే కరించే పనిలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిమగ్నమయ్యారు.

ఇప్పటికే కొన్ని మండలాలలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉ న్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను వారి ఫొటోలను ప్రధానోపాధ్యాయులు సే కరించారు. త్వరలోనే వారి ఫొటోలతో కూడిన స మాచారాన్ని ఫ్లెక్సీల రూపంలో పాఠశాలలో ఏర్పా టు చేస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

ఫొటోలు, వివరాలతో ఫ్లెక్సీలు..

అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, గురుకు ల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలతోపాటు వారి ఫొటోలను సేకరించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించా రు. ఫొటోలు, వివరాలతో ఫ్లెక్సీలు ముద్రించి పాఠశాలల ఆవరణలో ప్రదర్శించాలని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయిస్తాం.

– అశోక్‌వర్మ, ఎంఈవో, లక్ష్మణచాంద 

Published date : 21 Dec 2024 04:18PM

Photo Stories