Skip to main content

10th Class: ‘పది’ ప్రత్యేక తరగతులు ప్రారంభం.. చదువులో వెనకబడిన వారికి ఇలా..

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి.
Introduction of tentn class special classes

వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఈమేరకు చదువులో వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపుతూ ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కాగా న‌వంబ‌ర్‌ చివరి వరకు విద్యార్థులకు ప్రతీరోజు సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.

డిసెంబర్‌ నుంచి ఉదయం 8నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

102 పాఠశాలలు..

జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 102 ఉండగా.. సుమారు 3,277 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. చదువులో వెనకబడిన వారిని గుర్తించి 30 నిమిషాలు సామర్థ్యాలను పెంచాలి. 30 నిమి షాలు స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది.

సబ్జెక్టుల వారీగా వెనకబడిన విద్యార్థులపై ఆయా టీచ ర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ ఉపాధ్యాయుడు 10వ తరగతి సిలబస్‌ తప్పనిసరిగా డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలి. అనంతరం పిల్లలను పూర్తిస్థాయిలో పరీక్షలకు సిద్ధం చేయాలి.. పాఠ్యాంశాలను రివిజన్‌ చేయడంతో పాటు చదివించడం, స్లిప్‌ టెస్ట్‌లు పెట్టాల్సి ఉంటుంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్ర తీరోజు పదో తరగతి వి ద్యార్థులకు తప్పనిసరిగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యే క శ్రద్ధ వహించాలి. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం.

– ఆజాద్‌ చంద్రశేఖర్‌, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌

Published date : 06 Nov 2024 04:10PM

Photo Stories