1 Teacher 2 Students: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో డిసెంబర్ 16న ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి బోధిస్తూ టీచర్ కనిపించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా బజారులో ఊర్దూ మీడియం ప్రాథమిక పాఠశా లలో ఐదో తరగతి వరకు మొత్తం 15 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
ఈమేరకు డిసెంబర్ 16న ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి హెచ్‌ఎం పాఠాలు బోధించారు. మరో టీచర్ సెలవులో ఉన్నారని తెలిపారు. కాగా టీచర్లు వంతులవారీగా పాఠశాలలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ చేసేటప్పుడు.. ఒకరు సెలవులో ఉన్నారని చెప్పడం పరిపాటిగా మారిందని వారు ఆరోపించారు.
Published date : 17 Dec 2024 11:55AM